Home /News /coronavirus-latest-news /

OMICRON RISING CASES AROUND THE WORLD AND COUNTRIES WITHIN THE RANGE OF SANCTIONS EVK

Omicron: ప్ర‌పంచ‌ వ్యాప్తంగా పెరుగుతున్న కేసులు.. ఆంక్ష‌ల వ‌ల‌యంలోకి దేశాలు

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Covid 19 Cases | ప్ర‌పంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ (Omicron) కేసులు క‌ల‌క‌లం రేపుతున్నాయి. నెమ్మ‌దిగా కేసుల సంఖ్య పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న పెరుగుతోంది. దీంతో ఆయా దేశాల‌ ప్ర‌భుత్వాలు ఆంక్ష‌లు పెంచుతున్నాయి.  దీంతో ప‌లు దేశాలు ఆంక్ష‌ల వ‌ల‌యంలోకి వెళ్తున్నారు. అమెరికా, జపాన్‌, బ్రిట‌న్, ఫ్రాన్స్ ఇప్ప‌టికే ఆంక్ష‌లు విధించాయి. 

ఇంకా చదవండి ...
    ప్ర‌పంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ (Omicron) కేసులు క‌ల‌క‌లం రేపుతున్నాయి. నెమ్మ‌దిగా కేసుల సంఖ్య పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న పెరుగుతోంది. దీంతో ఆయా దేశాల‌ ప్ర‌భుత్వాలు ఆంక్ష‌లు పెంచుతున్నాయి.  దీంతో ప‌లు దేశాలు ఆంక్ష‌ల వ‌ల‌యంలోకి వెళ్తున్నారు. అమెరికా, జపాన్‌, బ్రిట‌న్, ఫ్రాన్స్ ఇప్ప‌టికే ఆంక్ష‌లు విధించాయి. ఇండియాలో ముఖ్యంగా విదేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు ప‌రీక్ష‌లు త‌ప్ప‌ని స‌రి చేశారు.   ఒమిక్రాన్‌ ప్రభావం నుంచి దేశాల జాబితాను అట్‌ రిస్క్‌ పేరుతో కేంద్రం ప్రకటించింది. ఇందులో తొలుత యూకే, దక్షిణాఫ్రిక, బ్రెజిల్‌, బొట్సవానా, చైనా, ఘనా, మారిషస్‌, న్యూజీల్యాండ్‌, జింబాబ్వే, సింగపూర్‌ (Singapore), ఇజ్రాయిల్‌, హాంగ్‌కాంగ్‌ దేశాలు ఉన్నాయి. ప్ర‌పంచ దేశాల్లో కంటే మ‌న ద‌గ్గ‌ర ఇంకా ఆంక్ష‌లు త‌క్కువ‌గా ఉన్నాయి.  అమెరికా, ఫ్రాన్స్‌, యూకేలో త్వ‌ర‌లో జ‌రిగే క్రిస్మ‌స్ వేడుక‌ల‌పై ప‌లు ఆంక్ష‌లు విధించారు.

    క్రిస్మస్ (Christmas) కన్నా ముందే ప్రతిఒక్క రూ టీకా వేయించుకోవాలని ఫ్రాన్స్ ప్రభుత్వం ప్ర‌జ‌ల‌కు సూచించింది. ప్ర‌జ‌ల‌కు విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకోకుంటే మ‌ళ్లీ లాక్‌డౌన్ పెట్టాల్సి రావొచ్చ‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది.   బ్రిట‌న్‌ను ఒమిక్రాన్ వ‌ణికిస్తోంది. ఒక్క రోజే ఏకంగా 10వేల‌కు పైన ఒమిక్రాన్ కేసులున‌మోద‌వుతున్నాయి. మ‌ర‌ణాలు కూడా సంభ‌విస్తుండ‌డంతో ప‌లు ఆంక్ష‌ల‌ను యూకే విధిస్తోంది.

    Uttar Pradesh: కోటి విద్యార్థుల‌కు ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు.. యోగీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం


    మ‌న దేశంలో విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులతో మనదేశంలో కూడా ఒమిక్రాన్‌ (Omicron)  కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రం ఆదేశాల మేరకు రైల్వే శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కఠినమైన మార్గదర్శకాలను దక్షిణ మద్య రైల్వే (Railway) శాఖ జారీ చేసింది. ప్రతి రైల్వే కార్మికుడికి టీకాలు వేయడంతో పాటు మాస్క్ లేని వారికి రైల్వే స్టేషన్ల, రైళ్లలో ప్రవేశం లేదంటున్నారు అధికారులు. రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి రావాలని సూచిస్తున్నారు.

    Delhi Pollution: నిర్మాణ పనులు, ట్రక్కుల ప్రవేశంపై నిషేధం ఎత్తివేత‌.. రూల్స్ త‌ప్ప‌నిస‌రి!


    ఎక్కువ‌గా విదేశాల నుంచి వ‌చ్చిన వారిలో ఒమిక్రాన్ కేసులు క‌న‌ప‌డుతుండ‌డంతో ప్ర‌భుత్వం ప్ర‌యాణికులు టీకా త‌ప్ప‌నిస‌రిగా తీసుకొని ఉండాలి అంతే కాకుండా ఎయిర్‌పోర్ట్‌ (Airport)లో ఆర్టీపీసీఆర్ (RT-PCR) ప‌రీక్ష చేసుకోవాలని ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిబంధనల కార‌ణంగా RT-PCR పరీక్ష రేట్లు.. ఎయిర్‌పోర్టులో క్యూలు, రద్దీ అంశాలు అంతర్జాతీయ ప్రయాణికులకు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. కొన్ని విమానాశ్రయాలు ర్యాపిడ్ టెస్ట్ (Rapid Test) కోసం రూ. 3,000 కంటే ఎక్కువ వసూలు చేస్తున్నాయి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Corona, Covid cases, Covid rules, Omicron

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు