హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Omicron: త్వ‌ర‌లో క‌రోనా నుంచి విముక్తి.. ఒమిక్రాన్‌పై డ‌బ్ల్యూహెచ్ఓ డైరెక్ట‌ర్‌ల‌ కీల‌క వ్యాఖ్య‌లు!

Omicron: త్వ‌ర‌లో క‌రోనా నుంచి విముక్తి.. ఒమిక్రాన్‌పై డ‌బ్ల్యూహెచ్ఓ డైరెక్ట‌ర్‌ల‌ కీల‌క వ్యాఖ్య‌లు!

Omicron | ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో యూరప్ రీజియన్ డైరెక్టర్ హన్స్ క్లూగే గుడ్ న్యూస్ చెప్పారు. యూర‌ప్‌లో క‌రోనా ముగింపు ద‌శ‌కు వ‌స్తుంద‌ని వ్యాఖ్యనించారు. ఇందుకు కార‌ణాల‌ను ఆయ‌న పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...

  ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు (Corona Cases) జోరుగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా వ్యాప్తి వెల్లువలా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14 లక్షల టెస్టులు చేపట్టగా, కొత్తగా 3,06,064 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4కోట్లకు చేరువగా, 3.95కోట్లకు చేరింది. ముఖ్యంగా ఒమిక్రాన్ కార‌ణంగా కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి.  దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో యూరప్ రీజియన్ డైరెక్టర్ హన్స్ క్లూగే గుడ్ న్యూస్ చెప్పారు. యూర‌ప్‌ (Europe) లో క‌రోనా ముగింపు ద‌శ‌కు వ‌స్తుంద‌ని వ్యాఖ్యనించారు. ఇందుకు కార‌ణాల‌ను ఆయ‌న పేర్కొన్నారు. మార్చి నాటికి ఐరోపాలోని 60 శాతం మందికి ఓమిక్రాన్ సోకుతుంద‌ని తెలిపారు. అయితే ఒమిక్రాన్‌ వ్యాప్తి అనంత‌రం కొన్ని రోజుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంద‌ని వెల్ల‌డించారు. వ్యాక్సిన్ లేదా స‌హ‌జంగానైనా రోగనిరోధక శక్తి క‌ల‌గొచ్చ‌ని ఆయ‌న అన్నారు.

  Health Tips: క‌రోనా వేళ‌.. పిలల్ల‌కు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆయుర్వేద చిట్కాలు!

  త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

  అమెరికా (America) కు చెందిన ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ ఆంథోనీ ఫౌసీ కూడా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై ఇటువంటి అభిప్రాయాన్నే వ్య‌క్తం చేశారు . ఒమిక్రాన్ సోకిన త‌ర్వాత వేగంగా త‌గ్గిపోవ‌డం గుర్తించిన‌ట్టు వెల్ల‌డి ఈ మార్పు క‌రోనా ముగింపు ద‌శ‌కు చిహ్నంగా భావించ వ‌చ్చంచ‌ని ఆయ‌న అన్నారు.

  CoWin Portal: కోవిన్ రిజిస్ట్రేష‌న్‌లో మార్పులు.. ఇక‌పై మ‌రింత వెసులుబాటు

  దీనిపై డ‌బ్ల్యూహెచ్ఓ (WHO) కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఆఫ్రికాలో క‌రోనా కేస‌లు త‌గ్గుతున్న‌ట్టు గుర్తించిన డ‌బ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఆఫ్రికాలో నాల్గో వేవ్ త‌ర్వాత గ‌రిష్ట స్థాయికి క‌రోనా కేసులు చేరాయి. అనంత‌రం వేగంగా త‌గ్గాయి. భ‌విష్య‌త్‌లో యూరోపియ‌న్ రీజియ‌ర్‌, ఆసియా దేశాల్లోనూ ఇటువంటి అవ‌కాశం ఉంటుద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

  దేశంలో అక్క‌డే అధికం..

  కొవిడ్ 19  బారి నుంచి నిన్న ఒక్కరోజే 2లక్షల 43వేల 495 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3.68కోట్లకు చేరింది. దేశంలో రికవరీ రేటు 93.07 శాతంగా ఉంది. కొత్త కేసులు భారీగా వస్తుండటం, ఆ స్థాయిలో రికవరీలు లేకపోవడంతో దేశంలో యాక్టివ్ కేసులు భారీగా పేరుకుపోయాయి.

  Subhash Chandra Bose: ఐసీఎస్‌కు రాజీనామా లేఖ‌లో నేతాజీ ఏం రాశారు.. ట్రెండింగ్‌గా రాజీనామా లేఖ‌!

  ప్రస్తుతం 22లక్షల 49వుల 335 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మొత్తం కేసుల్లో ఈ సంఖ్య 5.69 శాతానికి సమానం. కొత్త కేసులు కొన్ని రాష్ట్రాల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. ఒక్క కర్ణాటకలోనే 50వేల కేసులు వచ్చాయి. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడులోనూ వైరస్ తీవ్రత అధికంగా ఉంది. వారాంతపు సెలవు కావడంతో ఆదివారం 27 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్లు అందించారు. ఇప్పటి దాకా మొత్తంగా 162 కోట్లకుపైగా టీకా డోసులను పంపిణీ చేశారు.

  First published:

  Tags: Corona, Corona cases, Omicron, Omicron corona variant, World Health Organisation

  ఉత్తమ కథలు