Home /News /coronavirus-latest-news /

OMICRON LED THIRD COVID WAVE MAY PEAK BY JAN END DAILY CASES COULD REACH 10 LAKH PREDICTS NEW MODEL SK

Corona Third wave: రోజు 10 లక్షల కేసులు.. సునామీలా మూడో దశ వ్యాప్తి.. తాజా సర్వేలో ఏం తేలిందంటే..

వర్షాకాలంలో వెళ్లినట్లే వెళ్లి చలికాలానికి మళ్లీ తిరగబెట్టింది కరోనా మహమ్మారి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తోపాటు పాత వేరియంట్లూ విజృంభిస్తుండటంతో ప్రపంచ దేశాల్లో మళ్లీ కేసులు, మరణాలు పెరిగాయి. మన దేశంలో నిన్న ఒక్కరోజే కొవిడ్ కాటుకు 327 మంది ప్రాణాలు కోల్పోగా, కొత్తగా 1.6లక్షల కేసులు నమోదయ్యాయి.

వర్షాకాలంలో వెళ్లినట్లే వెళ్లి చలికాలానికి మళ్లీ తిరగబెట్టింది కరోనా మహమ్మారి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తోపాటు పాత వేరియంట్లూ విజృంభిస్తుండటంతో ప్రపంచ దేశాల్లో మళ్లీ కేసులు, మరణాలు పెరిగాయి. మన దేశంలో నిన్న ఒక్కరోజే కొవిడ్ కాటుకు 327 మంది ప్రాణాలు కోల్పోగా, కొత్తగా 1.6లక్షల కేసులు నమోదయ్యాయి.

India Corona Third wave: ఆయా రాష్ట్రాల్లో మూడో దశ గరిష్ఠ తీవ్రత జనవరి-ఫిబ్రవరి మధ్య బయటపడుతుంది. మొత్తంగా మార్చి ప్రారంభం నుంచి ఉద్ధృతి తగ్గుతూ వచ్చే అవకాశం ఉంది.

దేశంలో రోజురోజుకూ కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు (Omicron Variant) పెద్ద సంఖ్యలో వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి చివరి నాటికి మూడో దశ(3rd wave in india) విజృంభించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రోజువారీ కేసులు గరిష్ఠంగా 10 లక్షలకు చేరుకోవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ISI) బృందం సంయుక్తంగా ఓ సర్వేను(third wave survey in india) రూపొందించింది. అయితే ఈ ప్రభావం ఫిబ్రవరి మొదటి వారంలో చూపిస్తుందని.. దీని ప్రభావం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుందని ఈ సర్వే స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల్లో మూడో దశ గరిష్ఠ తీవ్రత జనవరి-ఫిబ్రవరి మధ్య బయటపడుతుంది. మొత్తంగా మార్చి ప్రారంభం నుంచి ఉద్ధృతి తగ్గుతూ వచ్చే అవకాశం ఉంది.

Corona Bulletin: ఉప్పెనలా విరుచుకుపడుతున్న కరోనా థర్డ్ వేవ్... లక్షల్లో కొత్త కేసులు

* సర్వే సాగిందిలా..
గతంలో వెలుగుచూసిన ఇన్‌ఫెక్షన్లు, వ్యాక్సినేషన్ రేటు ఆధారంగా.. 30శాతం, 60శాతం లేదంటే 100శాతం మంది జనాభాకు వైరస్​ ప్రబలే అవకాశం ఉందని ఈ మోడల్ అంచనా వేసింది. ఈ శాతాలను బట్టే దేశంలో రోజువారీ కేసులు గరిష్ఠంగా 3 లక్షలు, 6 లక్షలు లేదా 10 లక్షలు ఉండవచ్చని పేర్కొంది. ఢిల్లీకి సంబంధించిన మోడల్ ప్రకారం.. జనవరి మధ్యలో అంటే మూడో వారంలో గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చు. తమిళనాడులో జనవరి చివరి వారం లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఉంటుంది. వైరస్‌ బారిన పడే వ్యక్తుల సంఖ్యను బట్టి ఉంటుంది. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి ఆధారంగా నిర్వహించిన ఈ అధ్యయనానికి ప్రొఫెసర్ శివ ఆత్రేయ, ప్రొఫెసర్ రాజేష్ సుందరేశన్ నేతృత్వం వహించారు.

No Liquor Sale: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. వీకెండ్ కర్ఫ్యూ లో మద్యం అమ్మకాలు బంద్

* ఇతర సర్వేలూ చెబుతున్నదీ ఇదే..
కాన్పూర్‌ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పరిశోధకుల బృందం సైతం ఇదే విధమైన అధ్యయనాన్ని(third wave study) వెలువరించింది. వీరి ప్రకారం ఫిబ్రవరి 3 నాటికి భారత్​లో మహమ్మారి మూడో దశ గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని అంచనా. ఫిబ్రవరిలో కరోనా మూడో దశ వచ్చే అవకాశం ఉందని.. నేషనల్ కొవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ గత నెలలో అంచనా వేసింది. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రోజువారీ కేసులు పెరుగుతున్నట్లు గుర్తించింది.

Flurona Infection: ప్ర‌పంచానికి కొత్త త‌ల‌నొప్పి ఫ్లూరోనా ఇన్ఫెక్షన్.. దీని గురించి..

కొవిడ్-19 ట్రాకర్(covid 19 tracker) ఇండియా, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పరిశోధకుల సంయుక్త అధ్యయనం ప్రకారం.. డిసెంబర్(2021) చివరి వారం నుంచే కొత్త కేసుల్లో పెరుగుదల ప్రారంభం అవుతాయని.. దేశంలో రోజువారీ కేసులు విజృంభించే అవకాశం(third wave predictions) ఉందని అంచనా వేసింది. ఈ మేరకు జనవరి 3న విడుదల చేసిన తన నివేదికలో ఈ విధంగా పేర్కొంది. భారతదేశం అంతటా.. కరోనా కేసుల్లో రోజువారీ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేసులు పెద్దఎత్తున పెరుగుతున్నాయి. అయితే ఈ దశ కొద్ది రోజుల్లో ముగిసే అవకాశం ఉంది.

ఆ రాష్ట్రాల్లో కరోనా న్యూ కండీషన్స్ ..నైట్‌ కర్ఫ్యూ షురూ

ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో రోజువారీ వృద్ధి రేటు గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. తరువాతి దశలో కేసులు పెరుగుతూనే ఉంటాయని కొవిడ్-19 ట్రాకర్ పేర్కొంది. డిసెంబర్ 31 నుంచి రోజువారీ కేసులు ఐదు రెట్లు పెరగుతుండటంతో భారతదేశం కొవిడ్ కల్లోలాన్ని చవిచూస్తోంది. గడచిన ఏడు రోజుల్లోనే యాక్టివ్ కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. డిసెంబర్ 31 నుంచి ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా రెట్టింపు అయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్​సైట్ స్పష్టం చేస్తోంది. 2021 డిసెంబర్ నెలాఖరు నుంచి.. భారత్​లో కరోనా వైరస్ కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల నమోదవుతోంది. అయితే కేంద్రం మాత్రం దీన్ని థర్డ్ వేవ్​గా పేర్కొనకపోవడం గమనార్హం.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Corona bulletin, Corona cases, Corona third wave, Covid-19

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు