OMICRON IS THREE TIMES FASTER THAN DELTA CENTER LETTER TO STATES TO BE CAREFUL EVK
Omicron: డెల్టా కన్నా.. మూడు రెట్లు వేగంగా వ్యాప్తి.. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ
ప్రతీకాత్మక చిత్రం
Omicron Cases | దేశంలో ఇమిక్రాన్ వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ కేసులు మూడు రెట్లు వేగంగా కేసులు పెరుగుతున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. కేసులు పెరుగుదలపై ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. అన్ని రాష్ట్రాలు కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
దేశంలో ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ కేసులు మూడు రెట్లు వేగంగా కేసులు పెరుగుతున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. కేసులు పెరుగుదలపై ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. అన్ని రాష్ట్రాలు కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరం అయితే వార్ రూం ఏర్పాటుచేసుకోవాలని పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయని అప్రమత్తం అవసరం అని కేంద్రం తెలిపింది. ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఒమిక్రాన్‌కు సంబంధించి తాజాగా రాష్ట్రాలకు కేసుల పెరుగుదలపై లేక రాశారు. రాష్ట్రాలు అప్రమత్తమై కంటైన్మెంట్ జోన్లు", "బఫర్ జోన్లు వంటివి ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. 200 మంది రోగులు ఓమిక్రాన్ వేరియంట్ కరోనావైరస్ బారిన పడ్డారని భారతదేశం మంగళవారం నివేదించింది. వీరిలో 77 మంది రోగులు కోలుకున్నారని లేదా వలస వెళ్లారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.
Letter by @MoHFW_INDIA to states regarding measures that need to be taken in view of initial signs of surge in cases of #COVID19 as well as increased detection of the Variant of Concern (VoC), #Omicron in different parts of the country. pic.twitter.com/YSEXQqQcAw
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicran) అత్యంత వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది. దీంట్లో భారీ స్థాయిలో బయటపడిన మ్యుటేషన్లు వైరస్ (Virus) వ్యాప్తి రేటు పెరగడానికి కారణమవుతున్నాయి. కొన్ని నెలల క్రితం ప్రపంచాన్ని భయపెట్టిన డెల్టా వేరియంట్ (Delta Variant) కంటే ఈ కొత్త రూపాంతరం చాలా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు.
ఒమిక్రాన్‌లో ఇప్పటివరకు 50 మ్యుటేషన్లు ఉండటమే ఇందుకు కారణం. ఒమిక్రాన్ వేరియంట్‌కు చాలా వేగంగా పరివర్తన చెందగల సామర్థ్యం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తాజాగా ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా అవుతుండడంతో డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఈ వేరియంట్ 77దేశాలకు విస్తరించినట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
ఒమిక్రాన్ లక్షణాలు.. ప్రభావం
- ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ సోకిన వారికి నిర్దిష్ట లక్షణాలంటూ ప్రత్యేకంగా లేవు.
- డెల్టా వలె, ఓమిక్రాన్ సోకిన వారిలో కొందరిలో లక్షణాలు బయటపడడం లేదు.
- వేరియంట్ సోకినవారికి కండరాల నొప్పితో పాటు 1-2 రోజులు అలసిపోయినట్లు అనిపిస్తుంది.
- గొంతు నొప్పి, తలనొప్పి మరియు ఛాతీ నొప్పి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి తలనొప్పి, శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
- వ్యాక్సిన్ తీసుకోని వారు ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.