తెలంగాణ (Telangana) లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి తాజాగా 24 గంటల వ్యవధిలో 14 ఒమిక్రాన్ బారిన పడినట్టు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో తెలంగాణలో ఇప్పటికి 38మందికి కరోనా సోకినట్టు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో గడిచిన ఒక్క రోజులో 37,353 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిం చగా.. కొత్తగా 182 పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. దీం తో మొత్తం గా ఇప్ టివరకు నమోదైన కేసుల సం ఖ్య 6,80,074కి గా ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ట్విట్టర్లో బులిటెన్ విడుదల చేసిం ది. గత 24 గం టల వ్య వధిలో రాష్ట్రం లో కరోనాతో ఒక్క రు ప్రాణాలు కోల్పో యారు. దీం తో ఇప్ప టివరకు మృ తుల సం ఖ్య 4,017కు చేరిం ది. కరోనా (Corona) బారి నుం చి నిన్న 196 మం ది కోలుకున్నా రు. రాష్ట్రం లో ప్రస్తుతం 3,610 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కేంద్రం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (Ministry of Health and Family Welfare) ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 213 కరోనావైరస్ (Corona Virus) యొక్క ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మంగళవారం 11 కొత్త ఒమిక్రాన్ వేరియంట్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దీంతో మహారాష్ట్రలో రాష్ట్రంలో అటువంటి కేసుల సంఖ్యను 54కి తీసుకువెళ్లింది. రాజధానిలో ఓమిక్రాన్ కేసులు 57కి పెరిగాయి. ఢిల్లీ (Delhi), మహారాష్ట్ర (Maharashtra) లు దేశానికి అత్యధిక సంఖ్యలో కొత్త ఒమిక్రాన్ కేసులను ఈ ప్రాంతాల నుంచే వస్తున్నాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 6,317 కొత్త కోవిడ్ -19 కేసులు మరియు 318 మరణాలు నమోదయ్యాయి. దేశం క్రియాశీల కేసుల (Active Cases) సంఖ్య ప్రస్తుతం 78,190 వద్ద ఉంది, ఇది 575 రోజులలో కనిష్ట స్థాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ కేసులు మూడు రెట్లు వేగంగా కేసులు పెరుగుతున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. కేసులు పెరుగుదలపై ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. అన్ని రాష్ట్రాలు కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరం అయితే వార్ రూం ఏర్పాటుచేసుకోవాలని పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయని అప్రమత్తం అవసరం అని కేంద్రం తెలిపింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.