Home /News /coronavirus-latest-news /

OMICRON IN CHILDREN THESE ARE THE SYMPTOMS OF OMICRON FOUND IN CHILDREN KNOW PRECAUTIONS GH EVK

Omicron in Children: పిల్లల్లో కనిపించే ఒమిక్రాన్ లక్షణాలివే.. తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు!

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Omicron Symptoms | కోవిడ్-19 మొదటి వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్ లో ఎక్కువ మంది పిల్లలు వైరస్ బారిన పడ్డారు. అయితే ఇప్పుడు అదే ధోరణి ఒమిక్రాన్ వేవ్ లో కూడా కనిపిస్తుంది. పిల్ల‌ల్లో వైరస్ సంక్రమిస్తే కనిపించే లక్షణాలు ఏమిటీ?.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
కోవిడ్-19 (Covid -19) మొదటి వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్ లో ఎక్కువ మంది పిల్లలు వైరస్ బారిన పడ్డారు. అయితే ఇప్పుడు అదే ధోరణి ఒమిక్రాన్ వేవ్ లో కూడా కనిపిస్తుంది. చాలామంది పిల్లలు తీవ్రమైన లక్షణాలతో హాస్పిటల్ లో చేరే ప్రమాదంలో ఉన్నారు. చిన్నారుల్లో ఉండే అధిక ఇమ్యూనిటీ వల్ల వైరస్ (Virus) బారిన పడే పిల్లల సంఖ్య ఎంతో తక్కువగా ఉండేది. అందుకే పిల్లల్ని కేవలం వైరస్ క్యారియర్‌గా మాత్రమే పరిగణించేవారు. అయితే ఇప్పటి పరిణామాలు చూస్తే పిల్లలకు కూడా వైరస్ ముప్పు తప్పట్లేదు. చాలామంది పిల్లలు హాస్పిటల్ (Hospitals) బారిన పడుతున్నారు. అందుకే వైరస్ సంక్రమిస్తే కనిపించే లక్షణాల విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

Omicron: త్వ‌ర‌లో క‌రోనా నుంచి విముక్తి.. ఒమిక్రాన్‌పై డ‌బ్ల్యూహెచ్ఓ డైరెక్ట‌ర్‌ల‌ కీల‌క వ్యాఖ్య‌లు!

లక్షణాలు ఇవే..
1) కొన్ని అధ్యయనాల ప్రకారం.. అలసట అనేది పిల్లల్లో కనిపించే మొదటి లక్షణం. వైరస్ బారిన పడ్డ పిల్లలకు ముందుగా అలసటగా అనిపిస్తుంది.

2) ఆ తర్వాత తలనొప్పి, గొంతు నొప్పి, ముక్కు కారడం , తుమ్ములు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. జో కోవిడ్ అధ్యయనం ప్రకారం కరోనా వైరస్ లక్షణాలు పెద్దవారితో పోలిస్తే పిల్లల్లో భిన్నంగా ఉంటాయని వెల్లడైంది.

Health Tips: క‌రోనా వేళ‌.. పిలల్ల‌కు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆయుర్వేద చిట్కాలు!

ఈ అధ్యయనం కోసం.. కరోనావైరస్‌తో బాధపడుతున్న కొంతమంది పిల్లలు, పెద్దవారిని తీసుకుని వారి లక్షణాలను ట్రాక్ చేశారు. ఆ రిపోర్ట్ సాయంతో సాధారణ ఓమిక్రాన్ లక్షణాల జాబితాను సిద్ధం చేశారు. అందులో ఉన్న డేటా ప్రకారం, పెద్దవారిలో కనిపించే లక్షణాలు పిల్లల కంటే భిన్నంగా ఉంటాయని తేలింది. పిల్లల్లో ముఖ్యంగా అలసట, తలనొప్పి, ముక్కుకారటం ముఖ్య లక్షణాలుగా కనిపిస్తాయి.

ఒమిక్రాన్ (Omicron)  వేరియంట్ శరీరంలోని ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే కొంతమంది పిల్లల్లో కేవలం శ్వాస సంబంధిత లక్షణాలే కాకుండా అతిసారం దద్దుర్లు వంటి కొన్ని అసాధారణ లక్షణాలు కనిపిస్తాయి.

CoWin Portal: కోవిన్ రిజిస్ట్రేష‌న్‌లో మార్పులు.. ఇక‌పై మ‌రింత వెసులుబాటు

టీకా వేస్తేనే..
డెల్టా (Delta) వేరియంట్‌తో పోలిస్తే, ఓమిక్రాన్ వేరియంట్ ద్వారా ఎక్కువ మంది పిల్లలు ఎఫెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఇది కరోనావైరస్ ఇతర వేరియంట్‌ల కంటే ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇప్పుడు భారతదేశంలో 15 నుంచి 17 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. వీలైనంత త్వరగా పిల్లలకు టీకాలు వేయడం ద్వారా పిల్లల్ని వైరస్ బారి నుంచి కాపాడుకోవచ్చు. టీకా వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని అందిస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మనమేం చేయాలి?
పిల్లలకు ఒమిక్రాన్ సోకకుండా చూసుకోవాలంటే మీ పిల్లలు ఎప్పుడూ మాస్క్‌లు ధరించేలా చూడాలి. డబుల్ లేయర్డ్ మాస్కులు వాడడం ఇంకా మంచిది. రోజూ సరైన పరిశుభ్రతను పాటించడం, రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా పిల్లల్ని సేఫ్ గా ఉంచొచ్చు.
ఇకపోతే పిల్లలు జ్వరంతో పాటు తలనొప్పితో బాధపడుతుంటే.. వీలైనంత త్వరగా కోవిడ్ టెస్ట్‌ చేయించడం మంచిది.

Subhash Chandra Bose: ఐసీఎస్‌కు రాజీనామా లేఖ‌లో నేతాజీ ఏం రాశారు.. ట్రెండింగ్‌గా రాజీనామా లేఖ‌!

వైరస్ ఇన్ఫెక్షన్ గురైన చిన్నారుల్లో తలనొప్పి, జలుబు, పొడి దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అందుకే ఈ లక్షణాల్లో ఏది కనిపించినా వెంటనే డాక్టర్‌‌ను సంప్రదించాలి. పిల్లలు రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు జ్వరంతో బాధపడుతుంటే సాధారణ జ్వరంగా భావించి, ఏవేవో మందులు ఇవ్వడం మంచిది కాదు. డాక్టర్‌ను సంప్రదించి వారి సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి.
Published by:Sharath Chandra
First published:

Tags: Children, Corona, Delta Variant, Omicron, Omicron corona variant, Vaccination

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు