Home /News /coronavirus-latest-news /

OMICRON FEARS CRUISE DIVERSION TO SPECTRUM OF THE SEAS HONG KONG SNR

Hong Kong:భారీ నౌకలో భయం భయం..క్రూయిజ్‌లో ఉన్న ఆ 9మందికి ఏమైంది..?

Hong Kong

Hong Kong

Hong Kong: హాంకాంగ్‌ నుంచి భారీ నౌకలో బయల్దేరిన వాళ్లంతా ఇప్పుడు భయపడిపోతున్నారు. క్రూయిజ్‌లో 9మందికి ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందిన వాళ్లు ఉన్నట్లుగా గుర్తించడంతో నౌకను వెనక్కి తిప్పారు. మిగిలిన ప్రయాణికులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ నౌకలో ఉన్న వాళ్లలో ఇంకెంతమందికి వైరస్ సోకిందో..?

ఇంకా చదవండి ...
ఒమిక్రాన్ (Omicron)కొత్త వేరియంట్ కొంపలు ముంచేస్తోంది. ఇక్కడ..అక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. అందుకే పలు దేశాలు అంతర్జాతీయ విమాన ప్రయాణాలను  సైతం రద్దు చేస్తున్నాయి. విమాన ప్రయాణాలు తగ్గించినప్పటికి సముద్ర మార్గంలో ప్రయాణించే వాళ్లు సైతం వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా హాంకాంగ్‌(Hong Kong)కి చెందిన స్ప్రెక్ట్రమ్ ఆఫ్ ది సీస్‌ అనే క్రూయిజ్(Spectrum of the Seas) 3700మంది ప్రయాణికులతో బయల్దేరింది. అయితే అందులోని 9మంది ప్రయాణికులు ఒమిక్రాన్ (Omicron)వైరస్‌ సోకిన వారితో సన్నిహితంగా ఉన్నట్లుగా బయటపడటంతో అలజడి మొదలైంది. దీంతో పోర్ట్ అధికారులు భారీ క్రూయిజ్‌(Cruise)ని వెనక్కి పంపించాలని ఆదేశించారు. ఆ భారీ నౌకలో 3700మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 2500మంది ప్రయాణికులు ఉంటే..మరో 1200మంది నౌక సిబ్బంది ఉన్నారు. వీళ్లందరికి కోవిడ్ టెస్ట్‌లు నిర్వహించడానికి క్రూయిజ్‌(Cruise)ని పోర్ట్‌కు మళ్లించాలని సూచించారు. ఈ క్రూయిజ్‌(Cruise)లో లాక్‌డౌన్‌ (Lockdown)ముందు నుంచే కోవిడ్ నిబంధనల్ని(Covid rules) అమలు చేస్తున్నారు. ప్రపంచ దేశాలు పాటిస్తున్న అన్నీ కోవిడ్‌ రూల్స్‌ని ఇందులో అమలు చేస్తున్నారు. అయినప్పటికి 9మంది ఒమిక్రాన్‌ వేరియంట్‌ బారిన పడిన వాళ్లు ఇందులోకి ఎలా వెళ్లారన్న దానిపైనే సందిగ్ధం నెలకొంది. వాళ్లతో పాటు నౌకలో ఉన్న ప్రయాణికుల్లో ఎవరెవరు సన్నిహితంగా ఉన్నారు..? వాళ్లలో ఇంకా ఎంత మంది బాధితులయ్యారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఎంత మందికి సోకిందో..
స్ప్రెక్ట్రమ్ ఆఫ్ ది సీస్‌ క్రూయిజ్‌లో ప్రయాణిస్తున్న వాళ్లలో ఒమిక్రాన్‌ వైరస్‌ సోకిన వాళ్లు తమ పరిస్థితిని వారి కుటుంబ సభ్యులకు, మీడియా ప్రతినిధులకు చేరవేస్తున్నారు. నౌకలో అంతా బాగానే ఉందని..కోవిడ్‌ రూల్స్‌ పకడ్బందీగానే అమలు చేస్తున్నట్లుగా సంకేతాలిచ్చారు. అయితే టూర్ బుక్ చేసుకున్నప్పుడు కోవిడ్ ముప్పు పొంచి ఉంటుందని తమకు తెలుసని..కాకపోతే తామే మహమ్మారి వ్యాప్తికి కారణం కావడం దురదృష్టకరమని క్రూయిజ్‌లోని బాధితుల్లో ఒకరు అంతర్జాతీయ మీడియాకు మెసేజ్‌ పెట్టారు.

ఆ విధంగా గుర్తించారు..
క్రూయిజ్‌ టు నోవేర్ అనే సముద్ర ప్రయాణాలు నిర్వహించే సంస్థ ఈ స్పెక్ట్రమ్ ఆఫ్‌ ది సీస్‌ నౌకను చిన్న ప్రయాణాల కోసమే అంతర్జాతీయ జలాల్లోకి పంపుతుంది. క్యాథే పసిఫిక్‌ ఎయిర్‌లైన్‌ సిబ్బంది ద్వారా ఈ వైరస్ సామూహిక వ్యాప్తి చెందినట్లుగా నిపుణులు గుర్తించారు. అందుకోసమే క్రూయిజ్‌లో ఉన్న వాళ్లంతా తప్పని సరిగా టెస్ట్‌లు నిర్వహించాలని సూచించారు. నెగిటివ్ రిపోర్ట్‌ వచ్చిన వాళ్లను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తామని పాజిటివ్ వస్తే వాళ్లను ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచుతామని హాంకాంగ్‌ వైద్యాధికారులు వెల్లడించారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Covid, Hong kong, Omicron

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు