హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Omicron Effect: 11,500 విమాన స‌ర్వీసులు ర‌ద్దు.. ఒమిక్రాన్ నేప‌థ్యంలో ఐరోపా, యుఎస్‌లో ఆంక్ష‌లు

Omicron Effect: 11,500 విమాన స‌ర్వీసులు ర‌ద్దు.. ఒమిక్రాన్ నేప‌థ్యంలో ఐరోపా, యుఎస్‌లో ఆంక్ష‌లు

2. విమానాశ్రయం నుంచి బయలుదేరే ముందు విమానం ATC నుంచి అనుమతులను తీసుకోవాలి.  (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

2. విమానాశ్రయం నుంచి బయలుదేరే ముందు విమానం ATC నుంచి అనుమతులను తీసుకోవాలి. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ఒమిక్రాన్ ప్ర‌భావం ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా పాశ్చ‌త్యాదేశాలు ఐరోపా, యుఎస్‌లో ఒమిక్రాన్ కేసుల పెరుగుద‌ల ఆందోళ‌న క‌లిగిస్తుంది. దీంతో ఆయా దేశాలు నెమ్మ‌దిగా ఆంక్ష‌ల చ‌ట్రంలోకి వెళ్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఒమిక్రాన్ కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా 11,500 విమాన స‌ర్వీలుసు ర‌ద్దు అయిన‌ట్టు స‌మాచారం.

ఇంకా చదవండి ...

ఒమిక్రాన్ (Omicron) ప్ర‌భావం ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా పాశ్చ‌త్యాదేశాలు ఐరోపా, యుఎస్‌లో ఒమిక్రాన్ కేసుల పెరుగుద‌ల ఆందోళ‌న క‌లిగిస్తుంది. దీంతో ఆయా దేశాలు నెమ్మ‌దిగా ఆంక్ష‌ల చ‌ట్రంలోకి వెళ్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఒమిక్రాన్ కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా 11,500 విమాన స‌ర్వీలుసు ర‌ద్దు అయిన‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా కరోనా ప్ర‌భావం.. సిబ్బంది కొర‌త వంటివి విమాన ప్ర‌యాణాల‌పై ప్ర‌తికూల ప్రభావం చూపుతున్నాయి. ప్ర‌తీ వీకెండ్‌లో ర‌ద్దీగా ఉండే ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిప‌ర్‌పోర్టులు సాధార‌ణ ర‌ద్దీతోనే న‌డిచాయి. చాలా మంది హాలిడే ప్ర‌యాణాలు నిలిపివేసుకొంటున్న‌ట్టు స‌మాచారం. ఈ ఏడాది సిబ్బంది లేరని, క‌రోనా కార‌ణం చెప్పి విమానాలు ర‌ద్దు కావ‌డం చాలా స‌ర్వ‌సాధార‌ణం అయ్యిపోయింద‌ని ప్ర‌యాణికులు వాపోతున్నారు.

కోవిడ్-19తో సిబ్బంది కారణంగా.. షెడ్యూల్ చేసిన 4,000 కంటే ఎక్కువ విమానాలలో సోమవారం 115 విమానాలను రద్దు చేసినట్లు యునైటెడ్ తెలిపింది. మిన్నియాపాలిస్, సీటెల్ మరియు సాల్ట్ లేక్ సిటీలో సిబ్బందిపై కోవిడ్-19 ప్రభావం మరియు శీతాకాల వాతావరణం కారణంగా ఆదివారం 370 కంటే ఎక్కువ స్క్రాప్ చేసిన తర్వాత డెల్టా 4,100 కంటే ఎక్కువ షెడ్యూల్‌లో 200 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేయాలని భావిస్తోంది.

Booster Dose in India: బూస్ట‌ర్ డోస్‌పై సందేహాలా.. ప్ర‌భుత్వం తాజా గైడ్‌లైన్స్ ఇవే!


సోమ‌వారం ఒక్క రోజే 2,500 విమాణాలు ర‌ద్దు..

కొవిడ్ మహమ్మారి మళ్లీ ప్రళయతాండవం చేస్తుండటంతో ఏడాదిన్నర కిందటి పరిస్థితులు రిపీట్ అవుతున్నాయి. ఏడాదిలో అత్యధిక ప్రయాణాలు సెల‌వుల స‌మ‌యంలో వేలకొద్దీ విమానాలు ర‌ద్దువుతుండ‌డంతో జ‌నం ఇబ్బంది ప‌డుతున్నారు.

అర్ధాంతరంగా రద్దయిపోతుండటంతో లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లైట్ అవే రిపోర్ట్ ప్రకారం ఒక్క సోమవారం నాడే ప్రపంచవ్యాప్తంగా 2,500 విమాన సర్వీసులు రద్దయ్యాయి. అందులో 1000 సర్వీసులు అమెరికాకు చెందినవే కావడం గమనార్హం. రద్దయిన వెయ్యి సర్వీసులు కాకుండా అమెరికాలో మరో 9వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనంతటికీ కరోనానే కారణం.

ఇండియాలో రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ బూస్ట‌ర్ డోస్‌పై నిర్ణ‌యం తీసుకొన్నారు. వాజ్‌పేయి జ‌యంతి సంద‌ర్భంగా 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌లు ఇవ్వ‌డంతోపాటు ఫ్రంట్‌లైన్ కార్మికుల‌కు, 60 ఏళ్ల పైబ‌డిన వృద్ధుల‌కు బూస్ట‌ర్ డోస్ (మూడో డోస్‌) ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

CoWIN Registration for Children: పిల్ల‌ల‌కు కోవిడ్‌ వ్యాక్సిన్.. ఎప్ప‌టి నుంచి రిజిస్ట‌ర్ చేసుకోవాలి.. ఎలా చేసుకోవాలి!


ఈ బూస్ట‌ర్ డోస్ జ‌న‌వ‌రి 10 , 2021 నుంచి అందిస్తున్న‌ట్టు తెలిపారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య‌శాఖ బూస్ట‌ర్ డోస్ అందించేందుకు క‌స‌ర‌త్తు ప్రారంభించింది. క‌రోనా వ్యాక్సిన్ (Corona Vaccine) దేశంలో ఇవ్వ‌డం ప్రారంభించాక ముందుగా కోవిడ్ పోరులో ప్ర‌ధానంగా ఉన్న ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌కు ఇచ్చారు. అనంత‌రం 45 ఏళ్లు పైబ‌డిన వారికి ఇచ్చారు. ప్ర‌స్తుతం ఒమిక్రాన్ (Omicron) వ్యాప్తి నేప‌థ్యంలో మూడో డోస్ ఆవ‌శ్య‌క‌త‌ను ప్ర‌భుత్వం గుర్తించింది. ఈ నేప‌థ్యంలో బూస్ట‌ర్ డోస్ ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించిన తాజా గైడ్‌లైన్స్‌ను కూడా వెల్ల‌డించింది.

First published:

Tags: Flight, International, Omicron, Omicron corona variant

ఉత్తమ కథలు