అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. కరోనా పలు వేరియంట్లు సహా తాజా ఒమిక్రాన్ ఉద్ధృతితో అగ్రరాజ్యం వణికిపోతుంది. ఈ రోజు రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 4,41,278 కరోనా కేసులు వచ్చాయి. దీంతో అమెరికా అల్లాడిపోతుంది. డిసెంబర్ 25తో ముగిసిన వారంలో నమోదైన కొత్త ఇన్ఫెక్షన్లలో 58.6 శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయని సీడీసీ తెలిపింది. ఈ వారం రోజుల్లో సగటున రోజుకు 240,000 కంటే ఎక్కువ కేసులే నమోదైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వారంలో ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసులు 11 శాతం పెరిగాయి. క్రిస్మస్ వేడుకల కారణంగా కరోనా కేసులు గణనీయంగా పెరిగినట్టు వైద్యులు గుర్తిస్తున్నారు. ప్రజలు ఆంక్షల పాటింపులో నిర్లక్ష్యం కారణంగా ఈ కేసులు పెరుగుతున్నాయని అన్నారు.
ఒమిక్రాన్ (Omicron) ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా పాశ్చత్యాదేశాలు ఐరోపా, యుఎస్‌లో ఒమిక్రాన్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. దీంతో ఆయా దేశాలు నెమ్మదిగా ఆంక్షల చట్రంలోకి వెళ్తున్నాయి. ఇప్పటి వరకు ఒమిక్రాన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 11,500 విమాన సర్వీలుసు రద్దు అయినట్టు సమాచారం.
ముఖ్యంగా కరోనా ప్రభావం.. సిబ్బంది కొరత వంటివి విమాన ప్రయాణాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ప్రతీ వీకెండ్లో రద్దీగా ఉండే ఇంటర్నేషనల్ ఎయిపర్పోర్టులు సాధారణ రద్దీతోనే నడిచాయి. చాలా మంది హాలిడే ప్రయాణాలు నిలిపివేసుకొంటున్నట్టు సమాచారం.
ఇటు భారత దేశంలో ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ కేసులు మూడు రెట్లు వేగంగా కేసులు పెరుగుతున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. కేసులు పెరుగుదలపై ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. అన్ని రాష్ట్రాలు కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరం అయితే వార్ రూం ఏర్పాటుచేసుకోవాలని పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయని అప్రమత్తం అవసరం అని కేంద్రం తెలిపింది.
Omicron Effect: 11,500 విమాన సర్వీసులు రద్దు.. ఒమిక్రాన్ నేపథ్యంలో ఐరోపా, యుఎస్‌లో ఆంక్షలు
అంతే కాకుండా దేశంలో ఒమిక్రాన్ (Omicron) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ గుడ్ న్యూస్‌తో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పారు. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ అందించనున్నట్టు ప్రధాని ప్రకటించారు. ఈ వ్యాక్సినేషన్ జనవరి 03 నుంచి ప్రారంభం అవుతుందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Omicron, Omicron corona variant