Home /News /coronavirus-latest-news /

OMICRON COVID VARIANT GLOBAL RISK VERY HIGH SAYS WHO TILL NOW NO DEATHS MKS

Omicron : ప్రమాదకర ఒమిక్రాన్ వ్యాపిస్తే తట్టుకోలేం -ముప్పు అంచున ప్రపంచం :WHO సీరియస్ వార్నింగ్

ఒమిక్రాన్ పై డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక

ఒమిక్రాన్ పై డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక

ఒమిక్రాన్ వేరియంట్ తో కరోనా మరోసారి విజృంభిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ప్రపంచం ఆ ముప్పును తట్టుకోలేదని, ఇప్పటి వరకూ మరణాలు నమోదు కానంత మాత్రాన దాన్ని తేలికగా తీసుకోడానికి వీల్లేదని ప్రంపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల ఇప్పటి దాకా ఒక్కరు కూడా చనిపోలేదని, కాబట్టి అదంత ప్రమాదకారి కాదని గడిచిన కొద్ది గంటలుగా విశ్లేషణలు, కామెంట్లు వెలువడుతున్నాయి. ఏ ఇద్దరు కలిసి, ఏ ఇంట్లో విన్నా ప్రస్తుతం ఒమిక్రాన్ గురించే చర్చ. సౌతాఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్ ఇప్పటికే 14 దేశాలకు వ్యాపించగా, భారత్ లో మూడు అనుమానిత కేసుల జీనోమ్ లను టెస్టింగ్ కు పంపారు. ఒమిక్రాన్ పట్ల ప్రజల్లో అభిప్రాయాలు మారుతూ, దాని పట్ల నిర్లక్ష్య వైఖరి పెరుగుతున్నట్లు గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఆ మహమ్మారిపై కీలక ప్రకటన చేసింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో ప్రపంచానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని డబ్ల్యూహెచ్ఓ సోమవారం హెచ్చరించింది.

ఒమిక్రాన్ వేరియంట్ తో కరోనా మరోసారి విజృంభిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ప్రపంచం ఆ ముప్పును తట్టుకోలేదని, ఇప్పటి వరకూ మరణాలు నమోదు కానంత మాత్రాన దాన్ని తేలికగా తీసుకోడానికి వీల్లేదని ప్రంపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. సౌతాఫ్రికాలో గత వారం వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ లో అసాధారణ మ్యూటేషన్లు ఉండటంతో డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది.

Explainer : Omicron: షాకింగ్ ట్విస్ట్ -ఒమిక్రాన్ వేరియంట్‌ వ్యాప్తి మంచిదేనా? దీని దెబ్బకు డెల్టా వేరియంట్ ఖతం?



ఒమిక్రాన్ ను ఆందోళన కలిగించే వేరియంట్ గా డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. ఇప్పటిదాకా వెలుగు చూసిన ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లు ప్రమాదకరమైనవే కాగా, ఆందోళన కలిగించే జాబితాలో ఇప్పటిదాకా డెల్టా వేరింట్ ఒక్కటే ఉండగా, ఇప్పుడు దానికంటే ఆందోళనకారిగా ఒమిక్రాన్ పుట్టుకొచ్చింది. డెల్టా సహా ఇతర వేరియంట్లతో పోలిస్తే కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందా? లేదా మరింత తీవ్రమైన వ్యాధికి కారణమవుతుందా ? అనే విషయాలపై ఇంకా స్పష్టంగా తెలియదని, ఈ వేరియంట్ వల్ల ఎలాంటి భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయనే దానిపై కూడా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

Godavarikhani: భార్య అక్రమ సంబంధమే అసలు కారణం -యూట్యూబ్‌లో నాపేరు శివ సినిమా చూస్తూ శంకర్‌ను ముక్కలు చేశాడు..



సౌతాఫ్రికా సహా ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ పై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయని, సౌతాఫ్రికాలో ఈ వేరియంట్ వెలుగు లోకి వచ్చిన ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరిగిందని, అయితే అవి ఒమిక్రాన్ వల్లేనని ఇంకా నిర్ధారణ కాలేదని దీనిపై అధ్యయనాలు కొనసాగుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో చాలా దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధాలు, ఆంక్షలు విధిస్తున్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Coronavirus, Covid, Omicron corona variant, World Health Organisation

తదుపరి వార్తలు