హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Omicron corona variant: కొత్త వేరియంట్ ఆందోళ‌నక‌రం.. వ్యాప్తి నివార‌ణ‌కు చ‌ర్య‌లు అవ‌స‌రం: డ‌బ్ల్యూహెచ్ఓ

Omicron corona variant: కొత్త వేరియంట్ ఆందోళ‌నక‌రం.. వ్యాప్తి నివార‌ణ‌కు చ‌ర్య‌లు అవ‌స‌రం: డ‌బ్ల్యూహెచ్ఓ

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Omicron corona variant: ఈ కొత్త రకం వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) హెచ్చ‌రించింది. ఈ దేశాలు క‌రోనా వైర‌స్ వ్యాప్తిపై నిఘా పెంచాలని, వ్యాప్తి అడ్డుకొట్ట‌కు త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు చేప‌డితే మంచిద‌ని ఆగ్నేయాసియా ప్రాంత డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ సూచించారు.

ఇంకా చదవండి ...

క‌రోనా కొత్త వేరియంట్ ఇప్పుడు ఆందోళ‌న క‌లిగిస్తుంది. కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డామని ఊపిరిపీల్చుకుంటున్న వేళ.. మరో కొత్త వేరియెంట్ గుబులు పుట్టిస్తోంది. సౌతాఫ్రికాలో బయటపడిన B 1.1.529 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ కరోనా వేరియెంట్‌ (Corona VArient) మిగతా వాటితో పోల్చితే అత్యంత ప్రమాదకరమని, వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త రకం వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) హెచ్చ‌రించింది. ఈ దేశాలు క‌రోనా వైర‌స్ వ్యాప్తిపై నిఘా పెంచాలని, వ్యాప్తి అడ్డుకొట్ట‌కు త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు చేప‌డితే మంచిద‌ని ఆగ్నేయాసియా ప్రాంత డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ సూచించారు. కొవిడ్ వ్యాక్సినేష‌న్ మరింత వేగవంతం చేయడంతోపాటు వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. పండుగలు, ఇతర వేడుకల్ని కొవిడ్ నిబం ధనలకు లోబడి నిర్వ హిం చుకోవాలని, భౌతికదూరం పాటించడంతో పాటు జనసమూహాలకు దూరం గా ఉం డాలని ఆమె సూచించారు.

అల‌స‌త్వం వ‌ద్దు..

ప్ర‌జ‌లు కోవిడ్ 19 (Covid 19) నిబంధ‌న‌ లు పాటించేలా చూడ‌డంలో ఎటువంటి అల‌స‌త్వం వ‌ద్ద‌ని ఆమె సూచించారు. ప్ర‌స్తుతం ఆగ్నేయాసియా ప్రాంతంలోని చాలా దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం ప‌డుతున్న‌ప్ప‌టికీ కొత్త వేరియంట్ ప్ర‌మాద‌క‌ర‌మ‌ని కాబ‌ట్టి ప్రభుత్వాలు త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఈ వేరియంట్ ప్ర‌జ‌ల‌కు ర‌క్షించేందుకు వ్యాప్తి ఆధారంగా ప్ర‌యాణాల‌ను నివారించాల‌ని సూచించారు.

నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రి..

క‌రోనా కొత్త వేరియంట్ వైరస్ ముప్పు నుంచి రక్షణ పొందేందుకు అంద‌రూ కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని డ‌బ్ల్యూహెచ్ఓ సూచించింది. ప్ర‌జ‌లు బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మాస్కులు ధ‌రించ‌డం, కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించింది.

Omicron corona variant: న్యూయార్క్‌లో ఎమ‌ర్జెన్సీ.. తీవ్ర‌త పెర‌గ‌కుండా చ‌ర్య‌లు


అన్ని దేశాలు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని సూచించాయి. ఇప్పటివరకు ఆగ్నే యాసియా ప్రాం త జనాభాలో 31శాతం మంది పూర్తిగా వ్యా క్సిన్ వేయించుకోగా.. 21శాతం మందికి పాక్షికంగానే టీకా అందిందన్నారు. మిగతా 48శాతం మంది ఇంకా టీకా వేయించుకోవాల్సి ఉందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ వివ‌రించారు.

అప్ర‌మత్తంగా ఉండాలి మోదీ సూచ‌న‌

ఈ కొత్త వేరియంట్‌పై భారత ప్రభుత్వం ఇప్ప టికే అప్రమత్తమైం ది. ప్రధాని నరేం ద్ర మోదీ అత్యున్న త స్థాయి సమావేశం నిర్వ హిం చారు. అప్రమత్తం గా ఉం డాలని రాష్ట్రాలను హెచ్చ రిం చారు.

జాతీయ, అం తర్జాతీయ ప్రయాణికులు కచ్చి తం గా వ్యా క్సినేషన్ వేయిం చుకోవాలని సూచిం చారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని, ఆ మేరకు హెచ్చరికలు జారీ చేయాల్సిందిగా అధికారులను ప్రధాని మోదీ ఆదేశించారు.

IBPS Clerk 2021: ఐబీపీఎస్ క్ల‌ర్క్ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌.. ప‌రీక్ష విధానం


కొత్త వేరియంట్‌పై రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయడంతో పాటు ఇంకా కేసులు భారీగా వస్తున్న ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, కంటైన్మెంట్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అవగాహన పెంచాలన్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం సహా అన్ని జాగ్రత్తలు కఠినంగా అమలు చేయాలని సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పైనా నిర్దేశం చేసిన ప్రధాని.. ఇంటింటికీ వ్యాక్సిన్లు అందించే ‘హర్ ఘర్ దస్కత్‌’ కార్యక్రమంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

First published:

Tags: Covid -19 pandemic, Omicron corona variant, WHO, World Health Organisation

ఉత్తమ కథలు