ప్రస్తుతం దక్షిణాప్రికాలో SARS CoV 2 కొత్త రూపాంతరం చెంది వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ఇది అత్యంత ఆందోళనకరమైన వేరియంట్ గా వర్గీకరించింది. దీనిపై ప్రపంచదేశాలు జాగ్రతగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)హెచ్చరించింది. అయితే దీనికి ‘ఓమిక్రాన్’ అనే పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇక దీనిపై ముఖ్యమైన దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఆరోగ్య సంస్థ హెచ్చిరించిన వెంటనే విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించేందకు సిద్ధం అయ్యాయి. ఇక ఈ ఓబిక్రాన్ అనే కొత్త వేరియంట్ గత వారం దక్షిణాఫ్రికాలో కనిపించింది. దీనిని నెట్‌వర్క్ ఫర్ జెనోమిక్స్ సర్వైలెన్స్ ఈ వేరియంట్ ను గుర్తించింది. ఇది B.1.1.529 అనే వంశానికి చెందిన సంబంధిత SARS CoV 2 వైరస్‌ల సమూహాన్ని గుర్తించింది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వ్యాధి లక్షణాలు ఎంటీ.. ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
ఒమిక్రాన్ లక్షణాలు... ప్రభావం
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి నిర్దిష్ట లక్షణాలంటూ ప్రత్యేకంగా లేవు.
- డెల్టా వలె, ఓమిక్రాన్ సోకిన వారిలో కొందరిలో లక్షణాలు బయటపడడం లేదు.
- వేరియంట్ సోకినవారికి కండరాల నొప్పితో పాటు 1-2 రోజులు అలసిపోయినట్లు అనిపిస్తుంది.
- గొంతు నొప్పి, తలనొప్పి మరియు ఛాతీ నొప్పి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
- ఓమిక్రాన్‌పై మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ ప్రభావం లేదు.
Omicron Corona Variant: పొంచి ఉన్న ‘ఒమిక్రాన్’ ముప్పు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి
- ఓమిక్రాన్ రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది.
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి తలనొప్పి, శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
- వ్యాక్సిన్ తీసుకోని వారు ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు.
కొత్త వేరియంట్ వ్యాప్తిని నిరోధించేందుకు ఇజ్రాయిల్ విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. యూకేలో కూడా పరిస్థితి తీవ్రత పెరుగుతోంది.
Omicron Corona Variant: మ్యూటేషన్‌లు ఆందోళనకరం.. ఒమిక్రాన్‌పై డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్య
ఈ నేపథ్యంలో యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ మళ్లీ ఆంక్షలు విధించారు. ప్రజలు కొత్త వేరియంట్ వ్యాప్తి తగ్గించుకోవడానికి కోవిడ్ నిబంధనలు పాటించాలని మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలు అందరికీ టీకాలు అందేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. దక్షిణాఫ్రికాలోని జీనోమిక్స్ సర్వైలెన్స్ నెట్‌వర్క్(NGS-SA) చెప్పిన వివరాల ప్రకారం.. ఆ దేశంలో కొద్ది రోజుల్లోనే కేసులు నాలుగు రెట్లు పెరిగాయి. లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకుని వైద్యం అందుకోవచ్చు. కానీ, కొత్త వేరియెంట్ లక్షణాలు అంత త్వరగా బయటపడటం లేదు. బాగా ముదిరిని తర్వాత బయటపడితే.. వైద్యం కూడా కష్టమే అని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Covid -19 pandemic, Covid vaccine, Omicron corona variant