Home /News /coronavirus-latest-news /

OMICRON CORONA VARIANT THE IMPENDING THREAT LEARN THE PRECAUTIONS TO TAKE EVK

Omicron Corona Variant: పొంచి ఉన్న ‘ఒమిక్రాన్‌’ ముప్పు.. తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు తెలుసుకోండి

ఒమిక్రాన్ వేరియంట్

ఒమిక్రాన్ వేరియంట్

Omicron Corona Variant: క‌రోనా (Corona) నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్ర‌పంచాన్ని ఒక్రియాన్ వేరియంట్ క‌ల‌వ‌ర పెడుతోంది. ఇప్ప‌టికైతే ఎక్కువ కేసులు రాలేదు కానీ వేగంగా వ్యాప్తి చేందే ఈ వేరియంట్ ప్ర‌మాద‌కరంగా మారుతుంద‌ని వైద్యులు అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    క‌రోనా (Corona) నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్ర‌పంచాన్ని ఒక్రియాన్ వేరియంట్ క‌ల‌వ‌ర పెడుతోంది. ఇప్ప‌టికైతే ఎక్కువ కేసులు రాలేదు కానీ వేగంగా వ్యాప్తి చేందే ఈ వేరియంట్ ప్ర‌మాద‌కరంగా మారుతుంద‌ని వైద్యులు అంచ‌నా వేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాప్రికాలో SARS CoV 2 కొత్త రూపాంతరం చెంది వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ఇది అత్యంత ఆందోళనకరమైన వేరియంట్ గా వర్గీకరించింది. దీనిపై ప్రపంచదేశాలు జాగ్రతగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)హెచ్చరించింది. అయితే దీనికి ‘ఓమిక్రాన్’ అనే పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇక దీనిపై ముఖ్యమైన దేశాలు అప్రమత్తం అయ్యాయి.  . ఇది B.1.1.529 అనే వంశానికి చెందిన సంబంధిత SARS CoV 2 వైరస్‌ల సమూహాన్ని గుర్తించింది.  ఈ నేప‌థ్యంలో వైర‌స్ మ‌రింత వ్యాప్తి చెంద‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను తెలుసుకోండి.

    జాగ్ర‌త్త‌లు ఇవే..

    - కోవిడ్‌ నియంత్రణలో కీలకమైన కనీస నిబంధన మాస్కులు ధ‌రించ‌డం. మాస్కులు ధ‌రించ‌డంలో జ‌నం అశ్ర‌ద్ధ చేయ‌డం కూడా వైర‌స్ వ్యాప్తికి కార‌ణం అవుతుంద‌ని వైద్యుల చెబుతున్నారు. నాణ్య‌మైన మాస్కులు కూడా అందుబాటులో లేవ‌నేది ఒక వాద‌న‌. సాదాసీదా మాస్క్‌లైన స‌రై క్ర‌మంగా వాడితే వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చు.

    Cyber Security: మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్నారా.. ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి


    - ప్ర‌స్తుతం బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఉండ‌లేని ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలో బ‌య‌టకు వెళ్లి వ‌చ్చాక ఇంట్లో ఏందీ ముట్టుకోకుండా హ్యాండ్‌వాష్ (Hand Wash) చేసుకోవ‌డం ఉత్త‌మం. బ‌య‌ట వారీతో కాస్త భౌతిక దూరం పాటిస్తే మంచింది.

    - ప్రస్తుతం కోవిడ్‌ పాజిటివ్‌ (Covid Positive) వస్తున్నవారిలో చాలా వరకు సాధారణ లక్షణాలే ఉంటున్నాయని.. సాధారణ చికిత్సతోనే కోలుకుంటున్నారని వైద్యులు చెప్తున్నారు. అందులోనూ వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో వైరస్‌ (Virus) తీవ్రత తక్కువగా ఉంటోందని అంటున్నారు. కాబ‌ట్టి వైర‌స్ గురించి అతిగా ఆందోళ‌న పెట్టుకోకుండా జాగ్ర‌త్త‌లు పాటిస్తే మంచింది.

    Twitter Features: బ్లాక్ చేయ‌క్క‌ర్లేదు.. ఇలా చేస్తే చాలు.. ట్విట్ట‌ర్‌లో ప్రైవ‌సీ ఫీచ‌ర్స్ తెలుసుకోండి


    - ఫంక్షన్లు, పార్టీలు, రద్దీ ప్రదేశాల్లో గుమిగూడటం పెరిగింది. కాబ‌ట్టి ఇటువంటి వాటికి వీలైనంత దూరంగా ఉండండం మంచిది. త‌ప్ప‌ని స‌రి అనిపిస్తేనే వెళ్ల‌డం.

    లక్షణాలు భిన్నంగా?
    B.1.1.529 వేరియంట్‌కు సంబంధించి ఎలాంటి అసాధారణ లక్షణాలను గుర్తించలేదని దక్షిణాఫ్రికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NICD) తెలిపింది. డెల్టా వంటి ఇతర ఆందోళన రకం వేరియంట్‌ల మాదిరిగానే కొంతమందిలో ఎలాంటి లక్షణాలు లేవని, కొందరిలో తక్కువ లక్షణాలు కనిపిస్తున్నాయని సంస్థ వెల్లడించింది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Corona casess, Covid rules, Omicron corona variant

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు