Home /News /coronavirus-latest-news /

Omicron Corona Variant: మ్యూటేష‌న్‌లు ఆందోళ‌నక‌రం.. ఒమిక్రాన్‌పై డ‌బ్ల్యూహెచ్ఓ వ్యాఖ్య‌

Omicron Corona Variant: మ్యూటేష‌న్‌లు ఆందోళ‌నక‌రం.. ఒమిక్రాన్‌పై డ‌బ్ల్యూహెచ్ఓ వ్యాఖ్య‌

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Omicron Corona Variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ప్రపం చానికి తీవ్ర ముప్పు పొంచి ఉం దని ప్రపం చ ఆరోగ్య సంస్థ (World Health Organization) హెచ్చరించింది. దక్షిణాఫ్రికాలో ఈ కరోనా కొత్త వేరియం ట్ వెలుగుచూసిన సం గతి తెలిసిం దే. ఆ వేరియంట్‌లోని అసాధారణ మ్యుటేషన్లపై ఆందోళన వ్య‌క్తం చేసింది.

ఇంకా చదవండి ...
    ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ (Omicron Corona Variant). ఈ వేరియంట్ వ్యాపించిన దేశాలు లాక్‌డౌన్‌లు విధించాలని చూస్తున్నాయి. భారత్‌తో పాటు అనేక దేశాలు ప్రయాణ ఆంక్షలను సైతం విధిస్తున్నాయి. కరోనా కొత్త వేరియం ట్ ఒమిక్రాన్తో ప్రపం చానికి తీవ్ర ముప్పు పొంచి ఉం దని ప్రపం చ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దక్షిణాఫ్రికాలో ఈ కరోనా కొత్త వేరియం ట్ వెలుగుచూసిన సం గతి తెలిసిం దే. ఆ వేరియంట్‌లోని అసాధారణ మ్యుటేషన్లపై ఆందోళన వ్య‌క్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్ప టివరకు వెలుగు చూసిన ఆల్ఫా , బీటా, గామా వేరియంట్లకంటే ప్రమాదకరమైన జాబితాలోకి చేర్చింది. ఈ జాబితాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ మాత్రమే ఉంది. ఇక‌పై ఒమ్రికాన్ చేరే అవకాశం ఉందని డ‌బ్ల్యూహెచ్ఓ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

    ఇతర వేరియంట్లతో పోల్చుకుంటే..
    ఒమిక్రాన్ వేరియంట్‌తో రీఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని, డెల్టా సహా ఇతర వేరియంట్ల కంటే ఇది వేగంగా వ్యాపించవచ్చని WHO చెబుతోంది. అయితే ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందా లేదా మరింత తీవ్రమైన వ్యాధికి కారణమవుతుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.

    Omicron Corona Variant: పొంచి ఉన్న ‘ఒమిక్రాన్‌’ ముప్పు.. తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు తెలుసుకోండి


    ఒమిక్రాన్‌ లక్షణాలు ఇతర మ్యుటేషన్లకు భిన్నంగా ఉన్నాయని సూచించడానికి సైతం ప్రస్తుతం ఎలాంటి అధికారిక సమాచారం లేదని WHO తెలిపింది. బాధిత యువతలో చాలామందిలో తేలికపాటి లక్షణాలు కనిపించినట్లు దక్షిణాఫ్రికా చేపట్టిన అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. కానీ ఒమిక్రాన్ తీవ్రత స్థాయిని అర్థం చేసుకోవడానికి మరింత డేటా అవసరం. ఇందుకు కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు సమయం పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

    లక్షణాలు భిన్నంగా?
    B.1.1.529 వేరియంట్‌కు సంబంధించి ఎలాంటి అసాధారణ లక్షణాలను గుర్తించలేదని దక్షిణాఫ్రికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NICD) తెలిపింది. డెల్టా వంటి ఇతర ఆందోళన రకం వేరియంట్‌ల మాదిరిగానే కొంతమందిలో ఎలాంటి లక్షణాలు లేవని, కొందరిలో తక్కువ లక్షణాలు కనిపిస్తున్నాయని సంస్థ వెల్లడించింది.

    వేగంగా పంపిణీకి ప‌రిశోధ‌న‌లు..
    ప్ర‌స్తుతం ఉన్న టీకాలు స‌మ‌ర్థ‌వంతంగా కోవిడ్ 19 (Covid 19)ను క‌ట్ట‌డి చేస్తున్నాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

    Omicron corona variant: న్యూయార్క్‌లో ఎమ‌ర్జెన్సీ.. తీవ్ర‌త పెర‌గ‌కుండా చ‌ర్య‌లు


    అయితే కొత్త వేరియంట్‌పై టీకాలు ప‌ని చేస్తున్నాయ‌ని ద‌క్షిణాఫ్రికా మంత్రి పేర్కొన్నా.. ఆయా కంపెనీలు దీనిపై ప‌రిశోధ‌న‌లు చేస్తున్నాయి. ప్ర‌స్తుతం అమెరికా (America)కు చెందిన ఫైజ‌ర్‌, బయోఎన్టెక్ ప‌రిశోధ‌న‌లు మొద‌లుపెట్ట‌యాఇ. కొత్త వేరియంట్‌పై ప‌రిశోధ‌నలు శ‌ర‌వేగంగా పూర్తి చేసి ప‌నితీరును ప‌రిశీలిస్తామ‌ని ఆయా సంస్థ‌లు వెల్ల‌డించారు. వంద రోజుల్లోపు ప‌రిశోధ‌న‌లు పూర్తి చేసి పంపిణీ చేప‌డ‌తామ‌ని సంస్థ‌లు పేర్కొన్నారు. కొత్త వేరియంట్‌పై ఇత‌ర దేశాల‌కు చెందిన మోడెర్నా , జాన్సన్ అం డ్ జాన్సన్, ఆస్ట్రాజెనెకా సంస్థ‌లు ప‌రిశోధ‌న‌లు ప్రారంభించాయి. కొత్త వేరియంట్ కోసం బూస్ట‌ర్ డోస్ త‌యారు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని సంస్థ‌లు చెబుతున్నాయి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: America, Covid -19 pandemic, Omicron corona variant, World Health Organisation

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు