హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Omicron Corona Variant: క‌ల‌వ‌రపెడుతున్న కొత్త వేరియంట్‌.. టీకాలు ప‌ని చేస్తాయా?.. శాస్త్ర‌వేత్త‌లు ఏమంటున్నారు

Omicron Corona Variant: క‌ల‌వ‌రపెడుతున్న కొత్త వేరియంట్‌.. టీకాలు ప‌ని చేస్తాయా?.. శాస్త్ర‌వేత్త‌లు ఏమంటున్నారు

8.కంపెనీ నిర్వాహకులు సూపర్‌వైజర్లు, మేనేజర్‌లను నియమించడం ద్వారా మరియు CCTV ఫుటేజీ ద్వారా ఫేస్ మాస్క్‌లు ధరించడాన్ని పర్యవేక్షించాల‌ని తెలిపింది. మాస్క్‌లు ధరించని సిబ్బందిని పని స్థలం నుంచి బయటకు పంపాల‌ని తెలిపింది. డిపిహెచ్ ఇంకా 50 శాతం భోజన స్థలాలను మాత్రమే వినియోగించుకోవాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.  (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

8.కంపెనీ నిర్వాహకులు సూపర్‌వైజర్లు, మేనేజర్‌లను నియమించడం ద్వారా మరియు CCTV ఫుటేజీ ద్వారా ఫేస్ మాస్క్‌లు ధరించడాన్ని పర్యవేక్షించాల‌ని తెలిపింది. మాస్క్‌లు ధరించని సిబ్బందిని పని స్థలం నుంచి బయటకు పంపాల‌ని తెలిపింది. డిపిహెచ్ ఇంకా 50 శాతం భోజన స్థలాలను మాత్రమే వినియోగించుకోవాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Omicron Corona Variant: క‌రోనా (Corona) నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్ర‌పంచానికి కొత్త వేరియంట్ త‌ల‌నొప్పిని తేనుందా.. ప్ర‌స్తుతం వాడుతున్న టీకాలు ప‌ని చేస్తాయా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో శాస్త్ర‌వేత్త‌లు ఏమంటున్నారంటే..

ఇంకా చదవండి ...

  క‌రోనా (Corona) నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్ర‌పంచానికి కొత్త వేరియంట్ త‌ల‌నొప్పిని తేనుందా.. ప్ర‌స్తుతం వాడుతున్న టీకాలు ప‌ని చేస్తాయా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో శాస్త్ర‌వేత్త‌లు ఏమంటున్నారో చూద్దాం. క‌రోనా కొత్త వేరియంట్ ఇప్పుడు ఆందోళ‌న క‌లిగిస్తుంది. కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డామని ఊపిరిపీల్చుకుంటున్న వేళ.. మరో కొత్త వేరియెంట్ గుబులు పుట్టిస్తోంది. సౌతాఫ్రికాలో బయటపడిన B 1.1.529 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ కరోనా వేరియెంట్‌ (Corona VArient) మిగతా వాటితో పోల్చితే అత్యంత ప్రమాదకరమని, వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త రకం వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) హెచ్చ‌రించింది.

  టీకాలు ప‌ని చేస్తున్నాయి..

  దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియం ట్ ‘ఒమిక్రాన్’(B.1.1.529) ప్రపం చాన్ని గడగడలాడిస్తోంది. డెల్టా వంటి రకాలకన్నా అత్యం త వేగంగా వ్యా ప్తి చెందుతుండ‌డంతో ఆయా దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ వేరియంట్‌పై ద‌క్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ మం త్రి జో ఫాహ్లా ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఉన్న కొవిడ్-19 టీకాలు ఒమిక్రాన్ రకం పై పనిచేస్తున్నాయని జో ఫాహ్లా వెల్లడిం చారు.

  Omicron corona variant: న్యూయార్క్‌లో ఎమ‌ర్జెన్సీ.. తీవ్ర‌త పెర‌గ‌కుండా చ‌ర్య‌లు


  ఇప్ప టివరకు కొద్ది మం దిలోనే ఈ వేరియంట్‌ను గుర్తిం చినట్లు తెలిపారు. అయితే జన్యు పరమైన మార్పుల కారణంగా ఈ వేరియంట్ ఒకరి నుం చి మరొకరికి వేగం గా వ్యా ప్తి చెం దే ప్రమాదం ఉందని హెచ్చ రిం చారు. అయితే, ఒమిక్రాన్ వ్యాప్తి తొలి దశలోనే ఉందని.. టీకా తీసుకున్న వారిలో ఈ వేరియంట్ ఎంత మేర ప్రభావం చూపుతుం దో ఇం కా తెలియదని కొందరు శాస్త్రవేత్తలు పేర్కొం టున్నారు.

  వేగంగా పంపిణీకి ప‌రిశోధ‌న‌లు..

  ప్ర‌స్తుతం ఉన్న టీకాలు స‌మ‌ర్థ‌వంతంగా కోవిడ్ 19 (Covid 19)ను క‌ట్ట‌డి చేస్తున్నాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

  Omicron corona variant: న్యూయార్క్‌లో ఎమ‌ర్జెన్సీ.. తీవ్ర‌త పెర‌గ‌కుండా చ‌ర్య‌లు


  అయితే కొత్త వేరియంట్‌పై టీకాలు ప‌ని చేస్తున్నాయ‌ని ద‌క్షిణాఫ్రికా మంత్రి పేర్కొన్నా.. ఆయా కంపెనీలు దీనిపై ప‌రిశోధ‌న‌లు చేస్తున్నాయి. ప్ర‌స్తుతం అమెరికా (America)కు చెందిన ఫైజ‌ర్‌, బయోఎన్టెక్ ప‌రిశోధ‌న‌లు మొద‌లుపెట్ట‌యాఇ. కొత్త వేరియంట్‌పై ప‌రిశోధ‌నలు శ‌ర‌వేగంగా పూర్తి చేసి ప‌నితీరును ప‌రిశీలిస్తామ‌ని ఆయా సంస్థ‌లు వెల్ల‌డించారు. వంద రోజుల్లోపు ప‌రిశోధ‌న‌లు పూర్తి చేసి పంపిణీ చేప‌డ‌తామ‌ని సంస్థ‌లు పేర్కొన్నారు. కొత్త వేరియంట్‌పై ఇత‌ర దేశాల‌కు చెందిన మోడెర్నా , జాన్సన్ అం డ్ జాన్సన్, ఆస్ట్రాజెనెకా సంస్థ‌లు ప‌రిశోధ‌న‌లు ప్రారంభించాయి. కొత్త వేరియంట్ కోసం బూస్ట‌ర్ డోస్ త‌యారు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని సంస్థ‌లు చెబుతున్నాయి.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Corona, Omicron corona variant, Vaccinated for Covid 19

  ఉత్తమ కథలు