Home /News /coronavirus-latest-news /

OMICRON CORONA THIRD WAVE IN INDIA WHAT EXPERTS AND SURVEYS SAY EVK

Corona Third Wave: ఇండియాలో క‌రోనా మూడో వేవ్‌.. నిపుణులు, స‌ర్వేలు ఏం చెబుతున్నాయి!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Corona Third Wave in India | ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కేసులు దేశంలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రలతో పాటు పలు రాష్ట్రాలలో కేసులు పెరుగుద‌ల గ‌ణ‌నీయంగా ఉంది. క‌రోనా డెల్టా వేరియంట్ కంటే ఎక్కువ ఇన్ఫెక్షియస్ వేరియంట్ వెర్షన్‌గా ఒమిక్రాన్ ఉంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు క‌రోనా మూడో వేవ్ వేపు వెళ్తున్నాయా.. ఇండియా (India)లో మూడో వేవ్ వ‌స్తుందా.. నిపుణులు ఏం అంటున్నారో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కేసులు దేశంలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రలతో పాటు పలు రాష్ట్రాలలో కేసులు పెరుగుద‌ల గ‌ణ‌నీయంగా ఉంది. క‌రోనా డెల్టా వేరియంట్ కంటే ఎక్కువ ఇన్ఫెక్షియస్ వేరియంట్ వెర్షన్‌గా ఒమిక్రాన్ ఉంది. ప్ర‌స్తుతం యూరప్, అమెరికా (America) లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఎక్కువ‌గా ఉంది. ఈ సంవత్సరం ఏప్రిల్, మేలలో ఇండియాలో సెకండ్ వేవ్ ప్ర‌జ‌ల‌ను బాగా ఇబ్బంది పెట్టింది. ప్ర‌స్తుతం ఢిల్లీలో పాక్షిక లాక్‌డౌన్ విధించింది. ప‌లు రాష్ట్రాల్లోనూ నెమ్మ‌దిగా ఆంక్ష‌లు విధిస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు క‌రోనా మూడో వేవ్ వేపు వెళ్తున్నాయా.. ఇండియా (India)లో మూడో వేవ్ వ‌స్తుందా.. నిపుణులు ఏం అంటున్నారో తెలుసుకోండి.

    ఫిబ్రవరి 3 నాటికి గరిష్ట స్థాయికి మూడో వేవ్‌.. IIT-K అధ్యయనం
    కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు నిర్వహించిన మోడలింగ్ అధ్యయనం ప్రకారం, ఫిబ్రవరి 3, 2020 నాటికి భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి మూడో వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుంద‌ని వెల్ల‌డైంది.

    Booster Dose in India: బూస్ట‌ర్ డోస్‌పై సందేహాలా.. ప్ర‌భుత్వం తాజా గైడ్‌లైన్స్ ఇవే!


    వచ్చే ఏడాది ప్రారంభంలో థర్డ్ వేవ్.. నేషనల్ కోవిడ్ సూపర్ మోడల్ కమిటీ
    నేషనల్ కోవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ సభ్యుల ప్రకారం, మూడో వేవ్ వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలోకి వ‌స్తుంద‌ని అంచనా వేసింది. నేషనల్ కోవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ ఛైర్మన్ విద్యాసాగర్ అంచనా ప్ర‌కారం మూడో వేవ్ రెండో వేవ్ క‌న్నా త‌క్కువ ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు.

    CoWIN Registration for Children: పిల్ల‌ల‌కు కోవిడ్‌ వ్యాక్సిన్.. ఎప్ప‌టి నుంచి రిజిస్ట‌ర్ చేసుకోవాలి.. ఎలా చేసుకోవాలి!


    టీకాలు తీసుకొంటే మూడో వేవ్ త‌ప్పించుకోవ‌చ్చు.. ద‌క్షిణాఫ్రికా శాస్త్ర‌వేత్త‌లు
    భారతదేశం ఓమిక్రాన్-ఆధారిత కోవిడ్ కేసులలో పెరుగుదల క‌న‌బ‌డుతుంది. ఒమిక్రాన్ ఇన్‌ఫెక్ష‌న్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. టీకాలు వేగంగా ఇస్తే మూడో వేవ్ ముప్పు త‌ప్పించుకోవ‌చ్చ‌ని ద‌క్షిణాఫ్రికా శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

    మూడో వేవ్ వ‌చ్చింది.. బీహీర్ సీఎం నితీష్ కుమార్
    బీహార్‌లో కోవిడ్ మహమ్మారి యొక్క మూడో వేవ్ వ‌చ్చింద‌ని ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డానికి అవ‌స‌ర‌మైన స‌న్నాహాలు చేస్తున్నామ‌ని బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్ర‌క‌టించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆసుపత్రుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఆరోగ్యశాఖ కృషి చేస్తోందని సీఎం పేర్కొన్నారు.

    దేశంలో ఒమిక్రాన్ (Omicron) కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ గుడ్ న్యూస్‌తో కొత్త సంవ‌త్స‌రానికి స్వాగ‌తం చెప్పారు. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్ అందించ‌నున్న‌ట్టు ప్ర‌ధాని ప్ర‌క‌టించారు. ఈ వ్యాక్సినేష‌న్ జ‌న‌వ‌రి 03 నుంచి ప్రారంభం అవుతుంద‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ యంత్రాంగం ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు జనవరి 1 నుంచి CoWIN ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వం సోమవారం తెలిపింది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Coroana cases, Corona third wave, Omicron, Omicron corona variant

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు