OMICRON CASES IN INDIA THE VACCINE ALONE IS NOT ENOUGH WHAT TO DO WITH THE OMICRON VACCINE EVK
Omicron: వాక్సిన్ ఒక్కటే సరిపోదు.. ఒమిక్రాన్ కట్టడికి ఇలా చేయాల్సిందే!
(ప్రతీకాత్మక చిత్రం)
Omicron Variant | దేశంలో కరోనా వేరియంట్ (Corona Variant) ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకుపెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా డేటాను విడుదల చేసింది. దేశంలో గుర్తించిన 183 ఒమిక్రాన్ కేసులలో 50 శాతం కేసులు కరోనా రెండు డోసులో తీసుకొన్నవారే ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది.
దేశంలో కరోనా వేరియంట్ (Corona Variant) ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకుపెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా డేటాను విడుదల చేసింది. దేశంలో గుర్తించిన 183 ఒమిక్రాన్ కేసులలో 50 శాతం కేసులు కరోనా రెండు డోసులో తీసుకొన్నవారే ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకోవడం మాత్రమే కాకుండా కోవిడ్ నిబంధనలు (Covid 19 Rules) పాటించడం ముఖ్యమని వైద్యులు సూచించారు. ఒమిక్రాన్ కట్టడికి వ్యాక్సిన్ మాత్రమే కాకుండా.. అందరూ మాస్క్‌లు, కోవిడ్ నిబంధనలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. దీని ద్వారా కోవిడ్ వ్యాప్తి తగ్గుతుందని. కరోనా చైన్ బ్రేక్ చేయాలంటే అందరూ కోవిడ్ నిబంధనలు పాటించడమే ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. భారతదేశంలో కనుగొనబడిన 183 ఓమిక్రాన్ కేసుల విశ్లేషణను శుక్రవారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ విడుదల చేశారు.
టీకా స్టేట్ తెలిసిన 96 ఓమిక్రాన్ కేసులు (మొత్తం 183లో), 87 (10 లేదా 91 శాతంలో తొమ్మిది) పూర్తిగా గుర్తించారు. వీరిలో ముగ్గురు బూస్టర్ షాట్లు కూడా అందుకున్నారు. ఇద్దరు పాక్షికంగా టీకాలు వేయగా, ఏడుగురు టీకాలు వేయలేదని తెలిపారు.
ఒమిక్రాన్ కేసులు గుర్తించిన వారిలో 73 మంది టీకా స్టేటస్ తెలియదని ప్రభుత్వం గుర్తించింది. ఒమిక్రాన్ సోకిన వారిలో 16 మంది టీకాకు అర్హులు కాదని వెల్లడించింది. 18 ఓమిక్రాన్ కేసుల్లో వారి ట్రావెల్ హిస్టరీ తెలియదని తెలిపారు. మిగిలిన 165 కేసుల విశ్లేషణలో 121 లేదా 73 శాతం మంది విదేశాలకు ప్రయాణించిన చరిత్రను కలిగి ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. 27శాతం మందికి ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ లేదని అధికారులు గుర్తించారు.
ఈ విషయంపై ICMR డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ మాట్లాడారు. ఒమిక్రాన్ సోకిన వారిలో తీవ్రమైన లక్షణాలు ఎవరిలోనూ కనబడటం లేదని తెలిపారు. ఒమిక్రాన్ సోకిన వారిలో దాదాపు 90శాతం కేసుల్లో మాత్రం ఎలాంటి లక్షణాలూ లేవని తెలిపారు.
దేశంలో ఒమిక్రాన్ (Omicron) కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రత్యేక చర్యలు తీసుకోంటుంది. నెమ్మదిగా టీకా వేగాన్ని కలిగి ఉన్న పది రాష్ట్రాలకు బృందాలను పంపనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ నిన్న జారీ చేసిన ఉత్తర్వుల వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్రం ఈ లిస్ట్‌లో రళ, మహారాష్ట్ర, తమిళనాడు (Tamil Nadu), బెంగాల్, మిజోరాం, కర్ణాటక (Karnataka), బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలతోపాటు రెండూ రెండు నెలల వ్యవధిలో ఎన్నికలు జరగనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో కేంద్రం బృందాలు ఐదు రోజుల పాటు సందర్శిస్తాయి. ఈ సమయంలో కేంద్ర బృందం పలు అంశాలను పరిశీలిస్తుంది. ఈ బృందం ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ పరీక్షలు (Covid Tests), నిఘాను మెరుగుపరచడం, కోవిడ్-తగిన ప్రవర్తనను అమలు చేయడంపై రాష్ట్ర ఆరోగ్య అధికారులతో కలిసి పని చేస్తారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.