Home /News /coronavirus-latest-news /

OMICRON ALERT KERALA CM PINARAYI VIJAYAN KEY DECISION NO VACCINE NO FREE MEDICAL TREATMENT NGS

No Vaccine No Treatment: వ్యాక్సిన్ తీసుకోకుంటే.. ఉచిత వైద్యం బంద్.. ఒమిక్రాన్ నేపథ్యంలో సీఎం నిర్ణయం

corona

corona

No Vaccine NO Treatment:మళ్లీ కరోనా భయం వెంటాడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. భారత దేశానికి కూడా హెచ్చరికలు అందుతున్నాయి. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ తరుముకొస్తున్న నేపథ్యంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకోకుంటే వైద్యం నిలిపివేస్తామని ప్రకటించారు.

ఇంకా చదవండి ...

    Kerala CM on Medical Bills: మళ్లీ కరోనా (Corona) ముప్పు తప్పదా.. కేసుల సంఖ్య తగ్గామని ఊరట చెందే పరిస్ధితి లేదా.. ప్రపంచాన్ని మళ్లీ గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ (Omicron).. భారత దేశాన్ని కూడా భయపెడుతోందా.. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేకపోయినా.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం (Central Government).. ఇప్పటికే అన్ని రాష్టాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ నిబంధనలు (kovid rules) కఠినంగా అమలయ్యేలా చూడమంది. కంటైన్మెంట్ జోన్లను కట్టుదిట్టంగా ఉండేలా చూడాలని సూచనలు చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో అప్రమత్తంగానే ఉంటున్నారు. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ విస్తించే ప్రమాదం ఉంది అనే హెచ్చరికల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Keral CM Pinarayi Vijayan) కీలక ప్రకటన చేశారు.


              కోవిడ్‌ నివారణ చర్యలకు సహకరించని వారికి ఉచిత వైద్యం        అందించబోమని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకోకుండానే కోవిడ్-19 పాజిటివ్‌గా మారిన వారి చికిత్స ఖర్చు ప్రభుత్వం భరించదని హెచ్చరించారు. కరోనా టీకాలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ.. ప్రభుత్వానికి సహకరించని వారికి ఉచిత వైద్యం నిలివేస్తామని సీఎం తేల్చి చెప్పేశారు. ఒకవేళ ఆరోగ్య పరిస్థితి లేదా ఇతర ఎలర్జీ కారణంగా వ్యాక్సిన్ తీసుకోలేని వారు.. ఎందుకు తీసుకోలేకపోయారన్నదానిపై.. వైద్యులతో ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాలని సూచించారు. ఇతరులు ఏడు రోజులకు ఒకసారి RT-PCR నెగటివ్ సర్టిఫికేట్‌ను సమర్పించాలి అన్నారు. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల నగదును అయా వ్యక్తులే భరించాలి అన్నారు సీఎం.


    ఇదీ చదండి: లక్షణాలు లేవని లైట్ తీసుకుంటున్నారా..? మీరు ఆరోగ్యంగానే ఉన్నారా..? ఇలా తెలుసుకోండి.?


    అలాగే ముందుగానే కఠినంగా వ్యవహిస్తే ప్రమాదం మన వైపు రాదని సీఎం విజయ్ భావిస్తున్నారు. అందుకే గత అనుభవాల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే వారికి, ప్రజలతో మమేకమయ్యే వారికి ఇది వర్తిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు అప్రమత్తం చేసినట్లు సీఎం చెప్పారు. ఇందులో భాగంగా విదేశాల నుంచి వచ్చే వారి ట్రావెల్ హిస్టరీని క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించాలన్నారు.




    డిసెంబర్ 1 నుండి 15 వరకు కేరళలో మరోసారి ప్రత్యేక టీకా డ్రైవ్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాల సమయాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని, అలాగే వికలాంగ పిల్లలను పాఠశాలలకు రావడానికి అనుమతి ఇస్తామన్నారు. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో కోవిడ్-19 సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి విజయన్ అధికారులకు కీలక సూచనలు చేశారు. కొత్త వేరియంట్ వల్ల కలిగే భయం కారణంగా మరిన్ని సడలింపులు ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చారు.. మరికొన్ని రోజులు కఠినంగా ఉండక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని.. ముఖ్యంగా అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దని.. అన్ని చోట్ల నిబంధనలు అమలు అయ్యేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు..


    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Corona alert, Corona cases, Kerala, Lockdown in kerala, Omicron, Pinarayi Vijayan

    తదుపరి వార్తలు