Home /News /coronavirus-latest-news /

OLD MAN BIRD NEST MASK ADDAKULA MANDAL MAHABUBNAGAR VB

Nest mask: పిట్టగూడు మాస్క్.. పెట్టుకుంటే కరోనా వైరస్ పరార్.. తాత నువు సూపర్..

పిట్టగూడు మాస్క్ పెట్టుకున్న వృద్ధుడు

పిట్టగూడు మాస్క్ పెట్టుకున్న వృద్ధుడు

Nest mask:  తన పింఛన్ తీసుకోవడానికి నేరుగా పొలం నుంచి ఇలా పిట్టగూడును మాస్క్ లా ధరించి రావడంతో అక్కడ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం చిన్న మునుగల్ చేడ్ గ్రామానికి చెందిన ఈయ‌న‌.. ఇప్పుడు అంద‌రి దృష్టిలోప‌డ్డాడు.

ఇంకా చదవండి ...
    తన పింఛన్ తీసుకోవడానికి నేరుగా పొలం నుంచి ఇలా పిట్టగూడును మాస్క్ లా ధరించి రావడంతో అక్కడ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.  మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం చిన్న మునుగల్ చేడ్ గ్రామానికి చెందిన ఈయ‌న‌.. ఇప్పుడు అంద‌రి దృష్టిలోప‌డ్డాడు. పెన్ష‌న్ కోసం త‌న పొలం నుంచి అడ్డాకులకు వ‌చ్చిన ఆయ‌న‌.. ఇలా పిట్టగూడు మాస్కు ధరించి క‌నిపించాడు. దీన్ని చూసి అక్క‌డున్న‌వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. మాస్క్ లేక‌పోయినా.. ఆయ‌న ముందు జాగ్ర‌త్త‌ను చూసి మెచ్చుకోలేక ఉండ‌లేక‌పోయారు. క‌రోనా వైర‌స్ తీవ్రంగా విజృంభిస్తున్న వేళ‌.. దాన్నుంచి కాపాడుకోవ‌డానికి వ్యాక్సిన్ కంటే కూడా మాస్క్ అవ‌స‌ర‌మే ఎక్కువైపోయింది. ఈ మ‌హమ్మారిని ఎదుర్కోవాలంటే మాస్క్ త‌ప్ప‌నిస‌రి అని ఎంత అవ‌గాహ‌న క‌ల్పించినా.. కొంద‌రికి అది అస్స‌లు ప‌ట్ట‌డం లేదు. వారు మాస్క్ ధ‌రించ‌క‌పోగా.. త‌మ నుంచి ఇత‌రుల‌కు వైర‌స్ సంక్ర‌మించేందుకు కార‌ణ‌మ‌వుతున్నారు.

    కానీ మాస్క్ లేక‌పోయినా..కావాల్సినంత కామ‌న్‌సెన్స్ ఉంద‌ని నిరూపించాడా వృద్ధుడు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా త‌నకు అందుబాటులో ఉన్న వ‌స్తువును నోటికి అడ్డంగా పెట్టుకుని మాస్క్ ప‌ట్ల నిర‌క్ష్యంవ‌హించే వారి క‌ళ్లు తెరిపించే ప్ర‌య‌త్నం చేశాడు. పింఛన్లు పంచే బీపీఎం మురళీ వృద్ధుడి ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.
    Published by:Veera Babu
    First published:

    Tags: Corona mask, Nest mask, Nice idea, Old man idea, Wear mask

    తదుపరి వార్తలు