‘వచ్చే ఏడాదిలోపు కరోనా వ్యాక్సిన్ కష్టమే’

పార్లమెంటరీ ప్యానల్‌తో సమావేశమైన పలువురు అధికారులు వచ్చే ఏడాదిలోపు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని తెలిపారు.

news18-telugu
Updated: July 10, 2020, 8:13 PM IST
‘వచ్చే ఏడాదిలోపు కరోనా వ్యాక్సిన్ కష్టమే’
ప్రతీకాత్మక చిత్రం (credit - twitter - reuters)
  • Share this:
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా కోవిడ్ 19కు వ్యాక్సిన్ వస్తే తప్ప మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం లేదని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి కరోనా వ్యాక్సిన్ వస్తుందని కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చినా... దీనిపై తాము భరోసా ఇవ్వలేమని సదరు ఫార్మా కంపెనీ వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే తాజాగా పార్లమెంటరీ ప్యానల్‌తో సమావేశమైన పలువురు అధికారులు వచ్చే ఏడాదిలోపు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్’మెంట్ అండ్ క్లైమెట్ ఛేంజ్‌పై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరైన అధికారులు ఈ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మార్చి 25 తరువాత ఈ కమిటీ తొలిసారిగా సమావేశమైంది.
Published by: Kishore Akkaladevi
First published: July 10, 2020, 8:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading