CoronaVirus: చిత్తూరు జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ సీజ్... ఎందుకంటే...

చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెద్దగా నమోదు కాకపోయినప్పటికీ... ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఐసొలేషన్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు అధికారులు.

news18-telugu
Updated: March 26, 2020, 7:48 PM IST
CoronaVirus: చిత్తూరు జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ సీజ్... ఎందుకంటే...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలనే అధికారులు సీజ్ చేశారు. కోవిడ్ -19 సంబంధించి ఐసోలేషన్ వార్డుల కోసం కొన్ని రోజులు కళాశాలను ఇచ్చేందుకు నిరాకరించడంతోపాటు ఈ నెల 23వ తేది తరగతులను నిర్వహించారు కాలేజీ నిర్వాహకులు. దీంతో కాలేజీని సీజ్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన స్థానిక తహశీల్దార్... కళాశాలకు నోటీసులు అంటించారు. కళాశాల గుర్తింపు రద్దుకు రెవెన్యూ అధికారులు సిఫార్సు చేశారు. చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెద్దగా నమోదు కాకపోయినప్పటికీ... ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఐసొలేషన్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు అధికారులు.

ఈ క్రమంలోనే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీని ఐసోలేషన్ కేంద్రం కోసం సహకరించాలని అధికారులు సూచించారు. అయితే ఇందుకు కళాశాల యాజమాన్యం నిరాకరించడంతో కాలేజీని సీజ్ చేశారు. కరోనా పాజిటివ్ కేసులు, అనుమానితుల సంఖ్య పెరిగితే... వారిని ఐసొలేషన్ కేంద్రాలకు తరలించేందుకు ప్రభుత్వం ఎక్కడికక్కడ ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం పలు ప్రాంతాలను గుర్తిస్తోంది. ఇవన్నీ తాత్కాలికమే కావడంతో... ఇందుకోసం కాలేజీలు, ఫంక్షన్ హాల్స్ వంటి వాటిని ఎంపిక చేసుకుంటోంది. ఇందుకు నిరాకరించిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటోంది.






First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు