Home /News /coronavirus-latest-news /

ఒక టీ కొట్టు... ఇద్దరు వ్యక్తులు... నరసరావుపేట కరోనా మిస్టరీ చేధన

ఒక టీ కొట్టు... ఇద్దరు వ్యక్తులు... నరసరావుపేట కరోనా మిస్టరీ చేధన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

లాక్ డౌన్ మొదలైన రోజే... దానిని పట్టించుకోకుండా ఓ వ్యక్తి టీ కొట్టు తెరిచాడు. అక్కడ ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి టీ తాగాడు.

    ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మిగతా నగరాల సంగతి ఎలా ఉన్నా... గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా కేసుల సంఖ్య 104కు చేరుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు నరసరావుపేటలో కరోనా ఈ స్థాయిలో వ్యాపించడం వెనుక ఉన్న మిస్టరీనీ పోలీసులు చేధించారు. లాక్ డౌన్ మొదలైన రోజే... దానిని పట్టించుకోకుండా ఓ వ్యక్తి టీ కొట్టు తెరిచాడు. అక్కడ ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి టీ తాగాడు. అతడి అక్కడే టీ తాగిన మరొకరికి కరోనా వచ్చింది. అతడు ఆస్పత్రిలో చేరడం.. చికిత్స తీసుకుంటూ చనిపోవడం జరిగింది.

    అతడు చనిపోయిన తరువాతే అతడికి కరోనా ఉందని నిర్థారణ అయ్యింది. అంతే... అతడికి కాంటాక్ట్‌లో కుటుంబసభ్యులతో సహా ఇరుగుపొరుగున ఉన్న మరికొందరికి కరోనా సోకింది. వారి ద్వారా ఈ వైరస్ విస్తరించిందని అధికారులు, పోలీసులు తేల్చారు. నరసరావుపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ కొందరికి కరోనా సోకడంతో... అక్కడ అనేక గ్రామాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. ఇక నరసరావుపేట నగరంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కొన్ని రోజుల పాటు కర్ఫ్యూ విధించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Coronavirus, Narasaraopet

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు