గద్వాలలో ఇళ్లకు తాళాలు... అధికారుల కీలక నిర్ణయం

గద్వాలలో ఇళ్లకు తాళాలు... అధికారుల కీలక నిర్ణయం

గద్వాలలోని రెడ్ జోన్లు

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో గద్వాల అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

 • Share this:
  కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో గద్వాల అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పట్టణంలోని రెడ్ జోన్లలో ఉన్న ఇంటింటికి తాళాలు వేస్తున్నారు. మర్కజ్ లింకుల కారణంగా గద్వాలలో కరోనా కేసులు విస్తరించాయి. దీనికితోడు గద్వాలకు సమీపంలో ఉన్న కర్నూలులో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అక్కడ కరోనా కారణంగా చనిపోయిన డాక్టర్ దగ్గర గద్వాలకు చెందిన అనేక మంది వైద్యం చేయించుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గద్వాలలో లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.

  ఈ మేరకు వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇంటింటికి తాళాలు వేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేశారు. ఫోన్ నెంబర్లు సేకరించి వారికి అవసరమైన వస్తువులు ఇంటికి పంపిణీ చేస్తున్నారు. గద్వాలలోని 37 వార్డులు రెడ్ జోన్లుగా ఉన్నాయి. దీంతో ఆ వార్డుల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. మొత్తానికి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గద్వాలలో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  అగ్ర కథనాలు