• HOME
  • »
  • NEWS
  • »
  • CORONAVIRUS-LATEST-NEWS
  • »
  • OFFICIALS OF A CREMATORIUM IN BANGALORE CHAMRAJPET PUT UP A HOUSE FULL SIGNBOARD OUTSIDE THE FACILITY DUE TO A LACK OF SPACE TO CREMATE THE DEAD BODIES SSR

HouseFull: ఈ హౌస్‌ఫుల్ బోర్డు సినిమా థియేటర్ ముందు కాదు.. శ్మశానం ముందు.. ఎక్కడంటే..

HouseFull: ఈ హౌస్‌ఫుల్ బోర్డు సినిమా థియేటర్ ముందు కాదు.. శ్మశానం ముందు.. ఎక్కడంటే..

చామరాజపేట స్మశానం ముందు గేటుకు హౌస్‌ఫుల్ బోర్డు

బెంగళూరులోని చామరాజపేట‌లోని ఓ స్మశానం ముందైతే ఏకంగా హౌస్‌ఫుల్ బోర్డ్ దర్శనమిచ్చింది. స్టార్ హీరోల సినిమాలు విడుదలైన సమయంలో థియేటర్‌లో సీట్లు ఖాళీ లేకపోతే సినిమా థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ.. కరోనా మృతదేహాలను దహనం చేసేందుకు స్మశానంలో ఖాళీ లేక హౌస్‌ఫుల్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి రావడం నిజంగా శోచనీయం.

  • Share this:
    బెంగళూరు: కర్ణాటకలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. రోజుకు 40 వేల కొత్త కరోనా కేసులు నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. కరోనా మరణాలు కూడా కన్నడిగులను బెంబేలెత్తిస్తున్నాయి. సోమవారం ఒక్కరోజే కర్ణాటకలో 239 కరోనా మరణాలు నమోదయ్యాయంటే వైరస్ ఏ స్థాయిలో విరుచుకుపడుతోందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా.. కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం సవాల్‌గా మారింది. పెరుగుతున్న కరోనా మృతదేహాల తాకిడికి అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానాలు కూడా సరిపోవడం లేదు. బెంగళూరులోని చామరాజపేట‌లోని ఓ శ్మశానం ముందైతే ఏకంగా హౌస్‌ఫుల్ బోర్డ్ దర్శనమిచ్చింది. స్టార్ హీరోల సినిమాలు విడుదలైన సమయంలో థియేటర్‌లో సీట్లు ఖాళీ లేకపోతే సినిమా థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ.. కరోనా మృతదేహాలను దహనం చేసేందుకు శ్మశానంలో ఖాళీ లేక హౌస్‌ఫుల్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి రావడం నిజంగా శోచనీయం. అయితే.. ఇలా శ్మశానం ముందున్న గేటుకు హౌస్‌ఫుల్ బోర్డు తగిలించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులోని చామరాజపేట శ్మశానంలో రోజుకు కనీసం 20 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అయితే.. కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందిన వారి మృతదేహాలను బంధువులు తీసుకొస్తూనే ఉండటంతో.. అంతకు మించి కరోనా మృతదేహాలను దహనం చేసే పరిస్థితి లేకపోవడంతో ఇక చేసేదేమీ లేక హౌస్‌ఫుల్ బోర్డును తగిలించారు. స్థానికులు ఇలా బోర్డు పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో మున్సిపల్ అధికారులు ఆ బోర్డును తీయించారు.

    బెంగళూరులో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా మరణాల కారణంగా అన్ని మృతదేహాలను దహనం చేసేందుకు సిటీలోని శ్మశానాల్లో అనువైన పరిస్థితులు లేవు. పరిమితికి మించి మృతదేహాలను తరలిస్తుండటంతో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం శ్మశానాల వద్ద పనిచేస్తున్న సిబ్బందికి సవాల్‌గా మారింది. మృతదేహాలను దహనం చేసేందుకు ఎలక్ట్రిక్ దహనవాటికలు బెంగళూరు నగరంలో 13 మాత్రమే ఉండటం సమస్యగా మారింది.

    బెంగళూరు నగరంలోని బీబీఎంపీ స్మశానవాటిక, చామరాజనగర్ శ్మశానవాటిక, విల్సన్ గార్డెన్ శ్మశానవాటిక, హెబ్బళ్ శ్మశానవాటికల్లో రోజుకు 20కి పైగా కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తుండటం సమస్యగా మారింది. ఇదిలా ఉంటే.. బెంగళూరు నగరంలో పెరుగుతున్న కరోనా మరణాల దృష్ట్యా ఆ మృతదేహాలను దహనం చేసేందుకు కర్ణాటక ప్రభుత్వ రెవెన్యూ శాఖ బెంగళూరు పరిసర ప్రాంతాల్లో 230 ఎకరాలను కేటాయించింది. అయినప్పటికీ కరోనా మరణాలు మరింతగా పెరుగుతుండటం.. అంత్యక్రియలు నిర్వహించేందుకు గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితులు కర్ణాటకలో నెలకొన్నాయి.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు