వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పరీక్షలు

ఎమ్మెల్యే ముస్తఫా సమీప బందువు ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయనకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

news18-telugu
Updated: March 28, 2020, 3:53 PM IST
వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పరీక్షలు
వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా(ఫైల్ ఫోటో)
  • Share this:
గుంటూరు వాసులను ఇప్పుడు కరోనా టెన్షన్ పెడుతోంది. గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫాకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముస్తఫా సమీప బందువు ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయనకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముస్తాఫాను కరోనా బాదితుడు కొన్ని రోజుల క్రితం కలిశాడు. దాంతో ఇప్పుడు ముస్తాఫాను, ఆయన కుటుంబ సభ్యులను మెడికల్ కాలేజీకి తరలించి పరీక్షలు చేస్తున్నారు. అయితే ఆయనకు ఏమైనా కరోనా సోకిందా? లేదా అన్నది తెలుసుకోవడానికి అని కొద్దిరోజుల్లో తేలనుంది. మరోవైపు రిపోర్టు వచ్చేవరకు ఆయనకు ఐసొలేషన్‌లో ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇటీవల గుంటూరులో ఓ కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో... బాధితుడు ఐసొలేషన్ వార్డు నుంచి తప్పించుకోవడంతో గుంటూరు ప్రజల్లో ఆందోళన ఎక్కువైంది. మరోవైపు ముస్తఫాతో పాటు కరోనా బాధితుడు కలిసిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. వారికి సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

First published: March 28, 2020, 3:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading