జీహెచ్ఎంసీలోని పారిశుధ్య కార్మికుల మొదలు కమీషనర్ వరకు వంద శాతం అధికారులు, సిబ్బందికి కరోనా వాక్సిన్ ఇప్పించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈనెల 15వ తేదీలోగా మొత్తం అధికారులు, సిబ్బందికి వాక్సిన్ వేయడం పూర్తి చేయాలని జోనల్ కమీషనర్లకు జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. వాక్సినేషన్ నిర్వహణపై జోనల్ కమీషనర్లతో కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంబంధిత అర్బన్ హెల్త్ సెంటర్లలో వాక్సినేషన్ ఇప్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని జోనల్ కమీషనర్లను ఆదేశించింది. ప్రతిరోజూ వాక్సిన్ వేసుకున్న వారి వివరాలు ప్రధాన కార్యాలయానికి పంపడంతో పాటు వాక్సినేషన్ వివరాలను కోవిడ్ పోర్టల్‌లో పొందుపర్చాలని తెలిపింది.
అన్ని స్థాయిల్లోనూ దాదాపు 30 వేల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ జీహెచ్ఎంసీలో ఉన్నారు. కరోనా కట్టడిలో భాగంగా 15వ తేదీ తర్వాత ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది వ్యాక్సిన్ వేసుకునే కార్యాలయాలకు రావాలని సూచించింది. కార్యాలయాలకు వచ్చే సందర్శకులు కూడా వాక్సిన్ వేసుకొని రావాలని విజ్ఞప్తి చేసింది. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తదితర కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నిన్న ప్రధాని మోదీ సైతం ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. 45 ఏళ్లు నిండివ వాళ్లందరికీ వందశాతం వ్యాక్సినేషన్ చేయాలని అన్నారు. మరోవైపు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉన్న సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ అందించిన ప్రభుత్వం.. మిగతా సిబ్బందికి కూడా కరోనా వ్యాక్సిన్ అందించడంపై దృష్టి సారించింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.