Corona Virus | తిరుపతిలో రెడ్ జోన్లు ఇవే...

తిరుపతిలో గురువారం తొలి కేసు నమోదు కావడంతో అధికార యంత్రాంగం నగరంలో హైఅలెర్ట్‌ ప్రకటించి కట్టుదిట్టమైన భద్రతకు ఏర్పాట్లు చేశారు.

news18-telugu
Updated: April 3, 2020, 12:45 PM IST
Corona Virus | తిరుపతిలో రెడ్ జోన్లు ఇవే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇక ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌కు హాజరై వచ్చిన తిరుపతికి చెందిన ఓ యువకుడికి వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అలాగే శ్రీకాళహస్తికి చెందిన మరో వ్యక్తికి, రేణిగుంటకు చెందిన ఇంకోవ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో జిల్లాలో మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. దీంతో శ్రీకాళహస్తిలోని నాగచిపాళ్యం ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి కట్టుదిట్టమైన నిబంధనలను అమలు చేస్తున్నారు.

అధికార యంత్రాంగం కూడా హైఅలెర్ట్‌ను ప్రకటించి, ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దని హెచ్చరికలు జారీచేస్తోంది. తిరుపతిలో గురువారం తొలి కేసు నమోదు కావడంతో అధికార యంత్రాంగం నగరంలో హైఅలెర్ట్‌ ప్రకటించి కట్టుదిట్టమైన భద్రతకు ఏర్పాట్లు చేశారు. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ 36వ వార్డు త్యాగరాజనగర్‌కు చెందిన ఓ యువకుడికి కరోనాకు సోకినట్టు నిర్థారణ కావడంతో... 36వ వార్డుతో పాటు 32, 35, 37, 38 ఈ వార్డులను రెడ్‌జోన్‌గా ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. త్యాగరాజ నగర్‌ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రాకుండా నిఘా పెంచారు. ఆ ప్రాంతంలో రసాయనాలు, బ్లీచింగ్, విస్తృతంగా చల్లుతున్నట్లు చెప్పారు. నగర ప్రజలు నిబంధనలను అతిక్రమించవద్దని హెచ్చరించారు.

Published by: Kishore Akkaladevi
First published: April 3, 2020, 12:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading