1000 పడకలతో కరోనా ఆస్పత్రి... దేశంలోనే తొలిసారి ఆ రాష్ట్రంలో...

కరోనా బాధితుల కోసం 1000 బెడ్స్‌తో ప్రత్యేకంగా ఆస్పత్రిని నిర్మించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది.

news18-telugu
Updated: March 26, 2020, 6:27 PM IST
1000 పడకలతో కరోనా ఆస్పత్రి... దేశంలోనే తొలిసారి ఆ రాష్ట్రంలో...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా కరోనా వైరస్‌ రోగుల కోసం ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 1000 పడకలతో ఆస్పత్రికి నెలకొల్పాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం 15 రోజుల్లోనే ఇలాంటి ఓ భారీ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురానున్నట్టు ANI వార్తా సంస్థ పేర్కొంది. భువనేశ్వర్‌లో 1000 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయడం కోసం SUM, KIIMS తో ఒడిశా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఈ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఒడిశా మైనింగ్ కార్పొరేషన్, మహానది కోల్ ఫీల్డ్ లిమిటెడ్ సంస్థలు ఆర్థిక సాయం చేయనున్నాయి. ఆ రెండు ఆస్పత్రుల్లోనూ వైద్య సేవలు 15 రోజుల్లోనే అందుబాటులోకి రానున్నట్టు తెలిసింది. KIIMS ఆస్పత్రి 450 బెడ్స్ ఆస్పత్రిని నెలకొల్పనుంది. SUM మేనేజ్‌మెంట్ 500 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయనుంది. దీంతోపాటు ఐసీయూ సేవలను కూడా అందించనున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 649 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో తొలి కరోనా మరణం నమోదైంది. భారత్‌లోని మొత్తం కరోనా బాధితుల్లో 47 మంది విదేశీయులు ఉన్నారు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు