కరోనా అంతం కావాలని.. గుడిలో నరబలి ఇచ్చిన పూజారి

నరబలి విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దవడంతో ఆలయ పూజారి వెంటనే గొడ్డలి తీసి సరోజ్ కుమార్ తలపై నరికాడు. అతడు అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు.

news18-telugu
Updated: May 28, 2020, 4:21 PM IST
కరోనా అంతం కావాలని.. గుడిలో నరబలి ఇచ్చిన పూజారి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కరోనాకు మందును కనిపెట్టేందుకు ఓవైపు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుంటే.. అదే సమయంలో మూఢనమ్మకాలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. కరోనా పోవాలంటూ ఓ పూజారి ఏకంగా నరబలి ఇచ్చాడు. ఆలయంలోనే ఓ వ్యక్తి తల నరికి అమ్మవారికి సమర్పించాడు. కటక్ జిల్లా నర్సింగ్‌పూర్‌ పీఎస్ పరిధిలోని బందాహుడా గ్రామంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

సన్సారి ఓజా (72) అనే వ్యక్తి 'బంద మా బుద్ధ బ్రాహ్మణి దేవి' ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఇతడికి బ్రాహ్మణి దేవత కలలోకి వచ్చి పరిష్కారం చెప్పాడట. ఈ నేపథ్యంలో ఆలయంలో నరబలి ఇచ్చేందుకు సరోజ్ కుమార్ ప్రదాన్ (52) అనే వ్యక్తిని ఎంచుకున్నాడు పూజారి. మాయమాటలు చెప్పి అతడిని బుధవారం రాత్రి ఆలయం వద్దకు తీసుకెళ్లాడు. ఐతే నరబలి విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దవడంతో ఆలయ పూజారి వెంటనే గొడ్డలి తీసి సరోజ్ కుమార్ తలపై నరికాడు. అతడు అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించి.. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్య చేసే సమయంలో పూజారి మద్యం మత్తులో ఉన్నాడని పోలీస్ అధికారులు చెప్పారు. ఐతే మృతుడు సరోజ్ కుమార్, పూజారి సన్సారి ఓజాకు పాత గొడవలు ఉన్నాయని.. ఓ మామిడి తోట విషయంలో ఇరు కుటుంబాల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయని స్థానికులు తెలిపారు.. ఐతే నరబలి ఇవ్వడం వల్లే కరోనా పోతుందని దేవి చెప్పడం వల్లే.. అలా చేశానని పూజారి చెప్పాడు. ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
First published: May 28, 2020, 4:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading