మీకు తెలుసా ఆ చీమలు కుడితే ఒళ్లంతా మండిపోతుంది. కానీ వాటిని చట్నీ చేసుకొని తింటే మాత్రం కరోనా లాంటి మహమ్మారి దరిదాపుల్లోకి చేరదంట. ఒడిశా(Odisha), చత్తీస్ఘడ్(Chattisgarh)లోని బస్తర్(Bastar)తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు ఈవిషయాన్నిమరింత బలపరుస్తున్నారు. చెట్లపై, పుట్లపై దొరికే ఎర్ర చీమ(Red ants)ల్లోని ఔషద గుణాల కారణంగా వాటిని పచ్చి మిరపకాయాల్ని రోటిలో వేసి పచ్చడి చేసుకొని తింటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల కరోనా వైరస్(Corona virus) నయం అవుతుందని నమ్ముతున్నారు. ఈ ఎర్రచీమల చట్నీ( Red ants chutney)తో ఫ్లూ, జబ్బు, దగ్గు(Cough),జలుబుతో పాటు శ్వాస ఇబ్బందులు తొలగిపోతాయని అంటున్నారు. ఏజెన్సీలో ఉండే గిరిజనులు ఎర్రచీమలతో చట్నీ చేసుకొని తింటే కరోనా తగ్గుతుందని చెప్పడమే కాకుండా తాము చెబుతున్న ఈ విషయాన్ని పరిశోధకులు పెడ చెవిన పెడుతున్నారని వాపోతున్నారు. ఎర్ర చీమలతో చేసిన చట్నీ(Red ants pickle)లో ప్రోటీన్(Protein) , కాల్షియం (Calcium), విటమిన్ బీ12(Vitamin b12), జింక్(Zink)లో పుష్కలంగా ఉంటాయని గిరిజనులు భావిస్తున్నారు. దీన్ని చాపడాగా పిలుస్తారు. ఎర్రచీమలతో చట్నీనే కాదు సూప్ కూడా చేసుకొని తాగుతున్నారు. చెట్లపై పట్టుకున్న చీమలను పేస్ట్‌లా చేసి వాటికి అల్లం, వెల్లుల్లి మిశ్రమం కలిపి నీళ్లను కలిపి తాగడం వల్ల డెంగ్యూ, మలేరియా, శ్వాస సమస్యలు రావని చెబుతున్నారు.
చీమల చెట్నీతో కరోనాకు చెక్ ..
ఎర్ర చీమల చట్నీతో కరోనా నయం అవుతుందని జోరుగా జరురుతున్న ఈప్రచారంపై నిజానిజాలు బయటపెట్టాల్సిన అవసరం ఉందని ఒడిశాకు చెందిన నయాధర్ పడియాల్ అనే పరిశోధకుడు ఒడిశా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎర్రచీమలతో తయారు చేసిన చట్నీలో కోవిడ్19 నివారించే సమర్ధత ఎంత వరకు ఉంది అనే విషయాన్ని నిర్ధారించాలని కోరారు. సాంప్రదాయ ఎర్రచీమల చట్నీపై అధ్యాయనం జరపాలంటూ వేసిన పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు దీనిపై పరిశోధనాత్మక అద్యాయనం అవసరం అని వాటిని కనుగొనాలని ఆయుష్ మంత్రిత్వశాఖ ఆదేశించింది. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి పురోగతి లేదు. ప్రపంచంలోని అనేక దేశాలలో చీమలు చాలా పోషకమైన, ఆరోగ్యకరమైన ఆహారంగా చూస్తున్నారు. తూర్పు ఆసియా , మధ్య దక్షిణ అమెరికాలు ఇందులో ప్రముఖమైనవి. అందుకే చాలా చోట్ల చీమలు తిన్న వారు కూడా ఎక్కువ కాలం జీవిస్తారని భావిస్తారు. కొన్ని రకాల చీమలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి, క్యాన్సర్‌లో ఔషధంగా కూడా పనిచేస్తాయని కూడా పరిశోధనలు సూచిస్తున్నాయి.
గిరిజనులు కనుగొన్న దివ్య ఔషదం అదేనా..
మన దేశంలో ఆహారపు అలవాట్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి. చాలా ప్రాంతాల్లో జంతువుల మాంసం తింటూ ఉంటారు. కానీ కీటకాలను ఆహార పదార్ధంలో తీసుకోవడం చాలా అరుదుగా చూస్తాం. కానీ కొన్ని ప్రాంతాల్లో ఎర్ర చీమలను ఇప్పుడు ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌లో దివ్యఔషదంగా కరోనాను నయం చేసే మందుగా వాడుతున్నారు. అయితే గిరిజనులు చెబుతున్న మాటల్లో ఏమేరకు వాస్తవం ఉందనే విషయాన్ని గుర్తిస్తే కరోనా వైరస్‌కు విరుగుడు కనుగొన్నట్లేనని జనం భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CORONA MEDICINE, Odisha