Corona Lockdown : గోర్లు పొడవుగా ఉంటే... కరోనా వేగంగా వ్యాపిస్తుందా... ఫాక్ట్ చెక్...

Corona Lockdown | Coronaupdate : కరోనా వైరస్ వచ్చాక... నెయిల్ పాలిష్ కంపెనీ వ్యాపారం జోరు తగ్గింది. ఎందుకో మీకు అర్థమయ్యే ఉంటుంది.

news18-telugu
Updated: April 18, 2020, 6:18 AM IST
Corona Lockdown : గోర్లు పొడవుగా ఉంటే... కరోనా వేగంగా వ్యాపిస్తుందా... ఫాక్ట్ చెక్...
గోర్లు పొడవుగా ఉంటే... కరోనా వేగంగా వ్యాపిస్తుందా... (File)
  • Share this:
Corona Lockdown | Coronaupdate : కొంత మందికి వేళ్లు సన్నగా ఉంటాయి. గోర్లు పొడవుగా ఉంటాయి. వాటికి డిజైన్లు, పాలిష్‌ల వంటివి కూడా ఉంటుంటాయి. చూడటానికి ఎందో అందంగా, ఆకర్షణీయంగా ఉండే ఆ గోర్లే ఇప్పుడు కరోనా వైరస్ త్వరగా వ్యాపించడానికి కారణం అవుతాయని అంటున్నారు డాక్టర్లు. ఎందుకు?.. మనం చేతుల్ని సబ్బుతో కడుక్కున్నప్పుడు... గోర్లతో సహా కడుక్కుంటున్నాం కదా అని మనం అడిగితే వాళ్లు ఓ ఆన్సర్ ఇస్తున్నారు. గోర్లు పెద్దవిగా ఉంటే... వాటి సందుల్లోకి సబ్బు నురగ పెద్దగా వెళ్లదని అంటున్నారు. కానీ ఆ చిన్న సందులోనే... దాదాపు 2000 దాకా కరోనా వైరస్ క్రిములు పట్టగలవని (అంత చిన్నగా ఉంటాయవి) అంటున్నారు. సో... మనం చేతుల్ని కడుక్కున్నాక... టవల్‌తో తడిని క్లీన్ చేసుకుంటాం. చేతులు క్లీన్ అవుతాయి.

ఇప్పుడే కడుక్కున్నాం కదా... వెంటనే హ్యాండ్ శానిటైజర్ రాసుకోవడమెందుకు... ఓ పావుగంట తర్వాత రాసుకుందాం అని అనుకుంటామని అనుకుందాం. ఈ పావు గంటలో... ఆ గోరు సందులో దాక్కున్న కరోనా వైరస్... పాకుతూ... వేలిపైకి వచ్చే ప్రమాదం ఉంటుంది. మన దురదృష్టం కొద్దీ... అప్పుడే ఏ ముక్కో దురద వస్తే... తెలియకుండానే మనం గోక్కుంటాం. అప్పుడు... ఓ 300 వైరస్ క్రిములు... వేళ్ల నుంచి ముక్కుకు అతుక్కుంటాయి. బయట వేడిగా ఉండటంతో... చల్లదనం కోసం అటూ ఇటూ వెతుకుతాయి. ముక్కు రంద్రాల్లోకి వెళ్తే... ఈ ఎండ గోల తప్పుతుందని అనుకుంటాయి. అలా బయల్దేరేటప్పుడు... మనం గాలి పీల్చుతుంటే... వాటికి ఏసీ తగులుతున్నట్లు నిపిస్తుంది. అలా వైరస్... ఓ గంట ప్రయాణించి... ఊపిరితిత్తుల్ని చేరుకుంటుంది. ఇక్కడైతే గాలి బాగా తగులుతోంది. ఇక్కడే మన నివాసం అనుకుంటూ... అక్కడ తిష్ట వేస్తుంది. అక్కడే పిల్లల్ని పెడుతుంది. ఆ పిల్లలు క్షణాల్లో పెద్దవై... మరిన్ని పిల్లలు పెడతాయి. ఇలా... గంటలు గడుస్తున్నకొద్దీ... 300 వైరస్ కాస్తా... లక్షలు, కోట్ల సంఖ్యలో పెరుగుతాయి.

ఇదంతా చెబుతున్న డాక్టర్లు... అసలీ గోల లేకుండా ఉండాలంటే... గోర్లను ఎప్పటికప్పుడు నెయిల్ కట్టర్‌తో కట్ చేసేసుకోమని చెబుతున్నారు. కొంతమందికి గోర్లు కొరుక్కునే అలవాటు ఉంటుంది. వాళ్లు ఈ పాటికే ఆ అలవాటు మానేసి ఉంటారని అనుకుందాం. సో... ఇప్పుడు మీరు ఎంత బిజీగా ఉన్నా... ఓ ఐదు నిమిషాలు కేటాయించుకొని.... మీ గోళ్లను చిన్నగా కత్తిరించేసుకోండి. ప్రతి 10 రోజులకు ఓసారైనా ఇలా చేస్తూ ఉంటే... కరోనా ఆటలు మన దగ్గర సాగవు.
First published: April 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading