NURSE OF VIJAYANAGARAM GIVES COVID 19 VACCINE TO PERSON WHILE TALKING IN PHONE AK
Vijayanagaram: ఇదెక్కడి చోద్యం.. వ్యాక్సిన్ ఇలా కూడా ఇస్తారా..? ఫోటో వైరల్
ఫోన్లో మాట్లాడుతూ వ్యాక్సిన్ ఇస్తున్న నర్సు
Vijayanagaram: ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ నర్సు ఫోన్లో మాట్లాడుతూ మహిళకు వ్యాక్సిన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వాలు వేగవంతం చేస్తున్నాయి. అయితే ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ నర్సు ఫోన్లో మాట్లాడుతూ మహిళకు వ్యాక్సిన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. నర్సును పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలోని జగన్నాథపురం అర్బన్ పీహెచ్‌సీకి చెందిన హేమలతగా గుర్తించారు. ఫోన్లో మాట్లాడుతూ వ్యాక్సిన్ వేయడం పట్ల అభ్యంతరం పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా వైద్యశాఖాధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జిల్లా వైద్యశాఖాధికారి రమణకుమారి హేమలతకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు.
పలుచోట్ల వైద్యులు, ఇతర సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చిన ముగ్గురు వృద్ధ మహిళలకు కరోనా వ్యాక్సిన్‌కు బదులుగా రేబిస్ వ్యాక్సిన్ అందించారు. షమ్లీ జిల్లాలోని కందార పీహెచ్‌సీకి సరోజ్, అనార్కలి, సత్యవతి అనే ముగ్గురు వృద్ద మహిళలు కరోనా టీకా వేయించుకోవడానికి వచ్చారు. అలా వచ్చిన వారికి పీహెచ్.సి సిబ్బంది టీకా అందించారు. టీకా వేసిన తరువాత జరిగిన పొరపాటును గ్రహించి షాక్ అయ్యారు. అయితే, టీకా తీసుకున్న ముగ్గురు మహిళల్లో కొన్ని దుష్ప్రభావాలు కనిపించాయి. దీంతో ఆందోళన చెందిన మహిళలు అధికారులకు ఫిర్యాదు చేశారు. అసలు విషయం తెలుసుకున్న అధికారులు, నిర్లక్ష్యంగా వ్యవహరించి రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.