Corona Virus Infection: ముక్కు నుంచి మెదడుకు పాకుతున్న కరోనా.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Corona Virus Infection:  కరోనావైరస్ ముక్కు ద్వారా మానుషుల మెదడులోకి ప్రవేశించే అవకాశం ఉందని తాజా అధ్యయనం చెబుతోంది. జర్మనీలోని చరైట్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు చేసిన ఈ అధ్యయనాన్ని నేచర్ న్యూరోసైన్స్ జర్నల్‌లో ప్రచురించారు.

news18
Updated: December 1, 2020, 3:09 PM IST
Corona Virus Infection: ముక్కు నుంచి మెదడుకు పాకుతున్న కరోనా.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: December 1, 2020, 3:09 PM IST
  • Share this:
మాయదారి మహమ్మారి కరోనా వైరస్ వెలుగుచూసి సంవత్సరం దాటింది. అప్పటి నుంచి ఈ మహమ్మారిపై శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. కరోనావైరస్ ముక్కు ద్వారా మనుషుల మెదడులోకి ప్రవేశించే అవకాశం ఉందని తాజా అధ్యయనం చెబుతోంది. జర్మనీలోని చరైట్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు చేసిన ఈ అధ్యయనాన్ని నేచర్ న్యూరోసైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ పరిశోధన ఫలితాలు కోవిడ్-19 రోగుల్లో నాడీ సంబంధ అనారోగ్యాలను గుర్తించడానికి సహాయపడతాయని విశ్లేషకులు చెబుతున్నారు. వీటి ఆధారంగా రోగ నిర్ధారణ, వైరస్ సంక్రమణను నివారించే చర్యలు తీసుకోవచ్చు. ‘SARS-CoV-2 లేదా Covid-19 వైరస్ శ్వాసకోశ వ్యవస్థతో పాటు, కేంద్ర నాడీ వ్యవస్థ (CNS)ను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది రుచి, వాసన కోల్పోవడం, తలనొప్పి, అలసట, వికారం వంటి నాడీ సంబంధిత అనారోగ్యాలకు దారితీస్తుంది’ అని అధ్యయనం పేర్కొంది.

SARS-CoV-2 బారిన పడిన వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇటీవల చేసిన పరిశోధనల్లో మెదడు, సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్‌లో వైరల్ RNA ఉనికిని గుర్తించారు. కానీ వైరస్ మెదడు లోపలికి ఎలా ప్రవేశిస్తుందో, మెదడులో ఎలా వ్యాపిస్తుందో స్పష్టంగా తెలియదని పరిశోధకులు చెబుతున్నారు.

అధ్యయనంలో భాగంగా కోవిడ్‌తో చనిపోయిన 33మంది రోగుల గొంతు పైభాగంలో ఉండే నాసోఫార్నిక్స్ భాగాన్ని, వారి మెదడులను విశ్లేషించారు. వీరిలో 22 మంది మగవాళ్లు, 11 మంది ఆడవాళ్లు ఉన్నారు. వైరల్ ఇన్ఫెక్షన్‌కు నాసోఫార్నిక్స్ భాగమే ముందుగా ప్రభావితమవుతుంది. అక్కడే వైరస్ వృద్ధి చెందుతుంది.

ఇది కూడా చదవండి... Corona కారణంగా ఆ మాత్రలు దొరకలేదట.. ఇక జన ప్రవాహానికి అడ్డుకట్ట వేయగలమా..?

మెదడులో వైరస్ RNA
ఇన్ఫెక్షన్‌తో చనిపోయిన వారి సగటు వయస్సు 71.6 సంవత్సరాలని పరిశోధకులు గుర్తించారు. కోవిడ్ -19 లక్షణాలు కనిపించినప్పటి నుంచి 31రోజుల తరువాత వారు చనిపోయారు. వారి మెదడు, నాసోఫారెంక్స్‌లలో SARS-CoV-2 RNA, ప్రోటీన్ ఉన్నట్లు కనుగొన్నారు. నాసోఫారెంక్స్‌లో చెక్కుచెదరకుండా ఉన్న వైరస్ కణాలు ఉన్నట్టు వారు గుర్తించారు. ఓల్డ్ ఫ్యాక్టరీ మ్యూకస్ మెంబ్రేన్‌లో వైరల్ ఆర్‌ఎన్‌ఏ అత్యధిక స్థాయిలో ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు.

ఆ భాగాల్లో వైరస్ ఆనవాళ్లు

ఓల్డ్ ఫ్యాక్టరీ మ్యూకస్ లేయర్‌లోని కొన్ని కణాలలో SARS-CoV-2 స్పైక్ ప్రోటీన్‌ను కూడా ఈ బృందం కనుగొంది. అక్కడి నుంచి వైరస్‌ మెదడులోకి ప్రవేశించడానికి ఎండోథెలియల్, నాడీ కణజాలాలను ఉపయోగించుకునే అవకాశం ఉంది. మానవ మెదడులో శ్వాసకోశ, గుండెనాళాల నియంత్రణ కేంద్రమైన మెడుల్లా ఆబ్లోంగటా (medulla oblongata)తో సహా నాడీ వ్యవస్థలోని ఇతర ప్రాంతాలలో కూడా SARS-CoV-2 ఉన్నట్లు వారు కనుగొన్నారు. మెదడులోకి వైరస్ ప్రవేశానికి దోహదపడే అంశాలపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని, ఇందుకు కోవిడ్ -19తో చనిపోయిన వారి శవపరీక్షలపై విస్తృతమైన అధ్యయనాలు (autopsy studies) నిర్వహించాలని పరిశోధకులు చెబుతున్నారు.
Published by: Srinivas Munigala
First published: December 1, 2020, 3:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading