అమరావతి ఆందోళనలపై కరోనా ఎఫెక్ట్...

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ కొన్ని నెలలుగా దీక్షలు చేస్తున్న వారికి అధికారులు నోటీసులు జారీ చేశారు.

news18-telugu
Updated: March 21, 2020, 8:45 PM IST
అమరావతి ఆందోళనలపై కరోనా ఎఫెక్ట్...
అమరావతి ఆందోళనలు (File)
  • Share this:
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ కొన్ని నెలలుగా దీక్షలు చేస్తున్న వారికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాపించకుండా చేపడుతున్న ముందస్తు జాగ్రత చర్యల్లో భాగంగా వైద్య శాఖ అధికారులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దీక్షా శిబిరాలను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. రైతుల జేఏసీ పేరుతో జరుగుతున్న ఎర్రపాలెం, కృష్ణాయపాలెం, మందడం, రాయపూడి, వెలగపూడి పెదపరిమి, తుళ్లూరు దీక్షా శిబిరాలను ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఖాళీ చేయాలని నోటీసుల్లో సూచించారు. పాలన వికేంద్రీకరణకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌ బహుజన పరిరక్షణ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సెస్‌ రహదారి డి–జంక్షన్‌ వద్ద చేపట్టిన దీక్షా శిబిరాలను కూడా ఖాళీ చేయాలని వైద్య శాఖ అధికారులు కోరారు. కరోనా మహమ్మారి విజృంభించకుండా దేశంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాలని సీఎం జగన్ కోరారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.


First published: March 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading