Home /News /coronavirus-latest-news /

NOT ONLY IN AIR CORONA VIRUS ALIVE IN DRINKING WATER ALSO CCMB DIRECTOR RAKESH MISHRA SENSATIONAL COMMENTS HSN

Corona Virus: గాల్లోనే కాదు తాగే నీటిలోనూ కరోనా వైరస్.. రెండు రోజుల పాటు బతికే ఉంటుందట..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

‘గాల్లోనే కాదు, నీళ్లల్లో కూడా కరోనా వైరస్ ఉంటుంది. నీళ్లల్లో రెండు రోజుల పాటు కరోనా వైరస్ బతికే ఉంటుంది’ అంటూ సీసీఎంబీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గాల్లో ఉన్న కరోనా వైరస్ వల్ల..

    దేశవ్యాప్తంగా కరోనా కేసులు ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్ లో రోజూ లక్షల్లో కేసులు, తెలుగు రాష్ట్రాల్లో 24 గంటల్లోనే పది వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంత రాష్ట్రాలన్నీ నష్ట నివారణ చర్యలను చేపట్టాయి. ప్రజల ప్రాణాలను రక్షిస్తూనే, ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తూ, మరో వైపు ఎక్కడికక్కడ ఆంక్షలతో కరోనా కేసుల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ అంశం అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాగునీటిలో కూడా కరోనా వైరస్ ఉంటుందని ఓ ప్రముఖ వైద్యుడు తేల్చిచెబుుతున్నారు. అయితే దాని వల్ల వచ్చిన ప్రమాదమేమీ లేదని కూడా భరోసా ఇస్తున్నారు.

    తాగునీటిలోనూ రెండ్రోజుల పాటు కరోనా వైరస్ బతికే ఉంటుందని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. నీటి ఉష్ణోగ్రత, అందులోని మలినాల తీవ్రత, నీటి స్వచ్ఛత వంటి పరిస్థితులపై ఆధారపడి వైరస్ జీవించి ఉంటుందని ఆయన చెబుతున్నారు. కొవిడ్ వైరస్ జన్యుక్రమ ఆవిష్కరణ పరిశోధనలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న దివ్యతేజ్, కార్తీక్ తో కలిసి ఆయన కరోనా వైరస్ పై అవగాహన కల్పించేందుకు జూమ్ కాల్ లో శనివారం ప్రత్యేకంగా మాట్లాడారు. వేడి నీళ్లల్లోల 65 డిగ్రీల వద్ద వైరస్ నిమిషాల వ్యవధిలోనే చనిపోతుందని రాకేశ్ మిశ్ర చెబుతున్నారు. అదే 4 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చల్లటి నీటిలో ఉన్న వైరస్ కు ఇన్ ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఉంటుందన్నారు.

    ‘నీటిలో ఉన్న కరోనా వైరస్ ఒక్కదానికే ఇన్ ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఉండదు. దానికి కొన్ని వందల కణాలు కావాల్సి ఉంటుంది. అందులోనూ మనం తాగే నీరు నేరుగా పొట్టలోకి వెళ్తుంది కాబట్టి ప్రమాదమేమీ లేదు. నీళ్లు తాగడం ద్వారా కరోనా కేసులు నమోదయిన సంఘటనలు మన దేశంలో ఇంత వరకు లేవు. కాకపోతే ముందు జాగ్రత్తగా కాచి చల్లార్చిన గోరు వెచ్చటి నీటిని, వేడి పదార్థాలనే తీసుకోండి‘ అని రాకేశ్ మిశ్ర సూచిస్తున్నారు. కరోనా వైరస్ ఎప్పటి వరకు మానవాళిపై పంజా విసురుతుంటుందో తెలియదనీ, అందరూ వ్యాక్సిన్లను తీసుకోవడం ద్వారా కాస్త అడ్డుకట్ట వేయొచ్చునని ఆయన అభిప్రాయపడుతున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, జనసమ్మూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Corona cases, Corona negative, Corona positive, Corona second wave

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు