Corona 2.0: ఆంధ్రప్రదేశ్ లో కొత్తరకం కరోనా.., అప్ డేట్ ఇదే..!

Corona 2.0: ఆంధ్రప్రదేశ్ లో కొత్తరకం కరోనా.., అప్ డేట్ ఇదే..!

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్తరకం కరోనా (Corona 2.0)పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు ఒక్క కేసును కూడా గుర్తించలేదన్నారు.

  • Share this:
    కొత్త రకం కరోనాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో కరోనా స్ట్రెయిన్ పై వదంతులు వ్యాపిస్తున్నందున వాటికి ప్రభుత్వం వాటికి చెక్ పెట్టింది. కరోనా స్ట్రెయిన్ పై ప్రజలు ఎలాంటి అపోహలు, ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు బ్రిటన్ నుంచి 1,363 మంది ఆంధ్రప్రదేశ్ కు వచ్చినట్లు తెలిపారు. ఐతే వీరిలో 1,346 మంది ఆచూకీని కనుగోన్నామని.., మరో 17 మంది వ్యక్తుల చిరునామా తెలియాల్సి ఉందన్నారు. ఇందులో 11 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. వీరి బ్లడ్ శాంపిల్స్ ను పుణెలోని వైరాలజీ ల్యాబ్, హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపినట్లు తెలిపారు. పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాతే కొత్త వైరస్సా..? లేదా అనేది నిర్ధారణవుతుందన్నారు.

    ఇప్పటివరకు 1,324 మంది క్వారంటైన్‌లో ఉన్నారని.. వారికి పరిచయస్తులైన 5,784 మందిని గుర్తించి వారి బ్లడ్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపినట్లు వివరించారు. బ్రిటన్ నుంచి వచ్చే ప్రతి ఒక్కరు టెస్ట్ చేయించుకోవాల్సిందేనని కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. కొత్తరకం వైరస్ పై నిరంతరం సమీక్ష జరుపున్నట్లు ఆయన తెలిపారు. బ్రిటన్‌ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా తమ వివరాలని వైద్య ఆరోగ్యశాఖ వెబ్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలన్నారు.

    వైద్యశాఖ పోర్టల్ లో నమోదు చేసుకోని ప్రయాణికులను రాష్ట్రంలోకి అనుమతిచ్చే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రయాణికుల వివరాలను సేకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఫీల్డ్ లెవల్లో పనిచేస్తున్నాయి. బ్రిటన్లో వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

    ఆంధ్రప్రదేశ్ కు సమీపంలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ డెస్కులను ఏర్పాటు చేసింది. బ్రిటన్‌ నుంచి వచ్చే వారికి పపరీక్షలు నిర్వహిస్తోంది. ఒకవేళ పాజిటివ్‌ అని తేలితే తప్పనిసరిగా హాస్పిటల్‌కు పంపించి చికిత్స అందించనుండగా, నెగటివ్‌ వచ్చిన వారు మరో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. క్వారంటైన్ పూర్తైన తర్వాత నిర్వహించే పరీక్షలో నెగిటివ్‌ అని వస్తేనే బయటకు అనుతిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం కేవలం బ్రిటన్లో మాత్రమే కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నందున.., రాష్ట్ర పరిధిలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం అన్ని శాఖల అధికారులను ఆదేశించింది.
    Published by:Purna Chandra
    First published: