హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Telangana: తెలంగాణకు ఊరట.. ఆ 13 మందిలో ఎవరికీ ఒమిక్రాన్ సోకలేదు

Telangana: తెలంగాణకు ఊరట.. ఆ 13 మందిలో ఎవరికీ ఒమిక్రాన్ సోకలేదు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Omicron: కొద్దిరోజుల క్రితం ఒమిక్రాన్ విస్తరించిన దేశాల నుంచి వచ్చిన పలువురు ప్రయాణికులకు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో.. వారికి ఒమిక్రాన్ వచ్చి ఉండే అవకాశం ఉందని అధికారులు భావించారు.

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణలోనూ ఈ కేసులు వెలుగు చూసే అవకాశం ఉందని వైద్యఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. అయితే కొద్దిరోజుల క్రితం ఒమిక్రాన్ విస్తరించిన దేశాల నుంచి వచ్చిన పలువురు ప్రయాణికులకు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో.. వారికి ఒమిక్రాన్ వచ్చి ఉండే అవకాశం ఉందని అధికారులు భావించారు. అలా విదేశాల నుంచి వచ్చి ఎయిర్ పోర్టులో నిర్వహించిన పరీక్షల్లోనే కరోనా పాజిటివ్ అని తేలిన 13 మంది నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. వారిని చికిత్స కోసం గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించారు. వీరిలో కొందరికి ఒమిక్రాన్‌ సోకే ఉండే అవకాశం ఉందని భావించిన అధికారులకు తాజాగా ఊరట లభించింది. 13 మందికి ఒమిక్రాన్ నెగిటివ్ అని తేలింది. వారికి ఒమిక్రాన్ లేదని జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదు.

మూడు రోజుల క్రితం పలు దేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన విదేశీ ప్రయాణికుల్లో 13 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగిన వారికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా కరోనా బారినపడ్డట్లు అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు వారిని గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మంది ప్రయాణికుల్లో బ్రిటన్ నుంచి నుంచి తొమ్మిది మంది, సింగపూర్‌, కెనడా, అమెరికా నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వీరి నుంచి నమూనాలను సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపారు.ఇక నిన్న బ్రిటన్‌ నుంచి వచ్చిన రంగారెడ్డి జిల్లా వాసికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో.. వారిని టిమ్స్‌కు తరలించారు. దీంతో విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా నిర్ధారణ అయిన సంఖ్య 13కు చేరుకుంది.

అయితే వీరిలో జర్మనీ నుంచి వచ్చిన ఓ మహిళ అధికారులను టెన్షన్ పెట్టింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అధికారులు, పోలీసుల కళ్లుగప్పి ఇంటికి వెళ్లిపోయింది. ఆమెకు పరీక్షలు నిర్వహించిన అధికారులు.. కరోనా పాజిటివ్ అని తేలడంతో టిమ్స్‌కు తరలించడానికి సిద్ధమయ్యారు. అయితే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది.

Omicron : భారత్‌లోనూ ఒమిక్రాన్ విజృంభణ -బూస్టర్ డోసు, పిల్లలకు టీకాలపై నేడు నిర్ణయం

Omicron Tension: జనవరి నుంచి మళ్లీ టెన్షన్.. ఫిబ్రవరిలో పీక్స్‌కు..! ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నకొత్త వేరియంట్

అయితే ఆ మహిళ పాస్‌పోర్టులోని అడ్రస్‌ ఆధారంగా కుత్బుల్లాపూర్ పరిధిలో ఆమె ఇల్లు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లోని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అధికారులు ఆమె నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి ఆ మహిళకు నచ్చజెప్పారు. ఆమెను టిమ్స్‌కు తరలించారు. ఆమెకు కరోనా పాజిటివ్‌కు రావడంతో.. ఆమె తల్లిదండ్రులను కూడా ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. మిగతా వారితో పాటే ఈ మహిళ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. అయితే ఆ మహిళ సహా అందరికీ ఒమిక్రాన్ లేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తుంటే.. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు.

First published:

Tags: Omicron corona variant, Telangana

ఉత్తమ కథలు