కరోనా సోకితే దాచలేరు... ఆ లక్షణం బయటకు కనిపిస్తుంది అంటున్న డాక్టర్లు

కరోనా సోకినప్పుడు చాలా మంది ఆ విషయం బయటకు చెబితే... ఎవరు ఎలా రియాక్ట్ అవుతారోనని చెప్పట్లేదు. అది కరెక్టు కాదంటున్నారు డాక్టర్లు.

news18-telugu
Updated: July 5, 2020, 10:55 AM IST
కరోనా సోకితే దాచలేరు... ఆ లక్షణం బయటకు కనిపిస్తుంది అంటున్న డాక్టర్లు
కరోనా సోకితే దాచలేరు... ఆ లక్షణం బయటకు కనిపిస్తుంది అంటున్న డాక్టర్లు (credit - twitter - reuters)
  • Share this:
ఈ కరోనా వైరస్ మనకు పెద్ద తలనొప్పిలాగే మారుతోంది. సపోజ్ ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ వ్యక్తికి కరోనా వస్తే... అతన్ని డాక్టర్లు ఇంట్లోనే ఉండి... ట్రీట్‌మెంట్ పొందమని చెబితే... అతని పరిస్థితేంటి? చుట్టుపక్కల వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు? వాళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయి? అనేది ఓ సమస్యగా మారుతోంది. "అయ్యో కరోనా బారిన పడ్డారే" అని జాలి పడితే పర్వాలేదు... అలా కాకుండా... "కరోనా పేషెంట్ మా అపార్ట్‌మెంట్‌లోనే ఉండాలా"... అని అనుకుంటే సమస్యే. ఇలాంటి పరిస్థితులు వస్తుండటం వల్లే... కరోనా వచ్చినట్లు చాలా మంది ఎవరికీ చెప్పట్లేదు. లోలోపలే దాచుకుంటూ... ఇబ్బంది పడుతున్నారు.

డాక్టర్లు మాత్రం కరోనాను దాచడం మంచిది కాదంటున్నారు. ఎవరికైనా కరోనా వస్తే... ఆ విషయాన్ని చుట్టుపక్కల వాళ్లకు తెలియనివ్వాలని చెబుతున్నారు. తద్వారా వాళ్లు కూడా వైరస్ రాకుండా మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారనీ... అలా కాకుండా దాచిపెడితే... దురదృష్టం కొద్దీ మరింత మందికి అది సోకే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.

తాజాగా తేలిన పరిశోధనలను బట్టీ... ఎవరికైనా కరోనా వస్తే... దాన్ని దాచిపెట్టడం సాధ్యం కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే దగ్గు, జలుబు, జ్వరం వంటివి మామూలుగా వచ్చేవే అని అనుకున్నా... ఆయాసం మాత్రం కరోనా పేషెంట్లకు అత్యంత ఎక్కువగా ఉంటోందనీ... ఆ లక్షణాన్ని దాచిపెట్టలేరని చెబుతున్నారు. అందుకే ఈమధ్య డాక్టర్లు... ఎవరైనా టెస్టు చేయించుకోవడానికి వస్తే... ఓ వంద అడుగులు నడవమని చెబుతున్నారు. కరోనా పేషెంట్లకు వ్యాధి ఎక్కువగా ఉంటే... వంద అడుగులు నడిచాక... ఊపిరాడని పరిస్థితి వస్తుంది. అదే... మామూలు జ్వరాలు వచ్చిన వారికి... ఆ పరిస్థితి ఉండదు. తద్వారా తమకు కరోనా వచ్చిన విషయాన్ని ఈజీగా గుర్తించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

ఆయాసం వస్తే... గుండెపై 100 కేజీల బరువు పెట్టినట్లు అనిపిస్తోందని కరోనా వైరస్ సోకిన వారు డాక్టర్లకు చెబుతున్నారు. తద్వారా ఆయాసం అనేది అత్యంత తీవ్రంగా ఉంటోందని అర్థమవుతోంది. ఈ కారణంగానే... చాలా మంది జలుబు, దగ్గు, జ్వరాన్ని తట్టుకోగలుగుతున్నారు గానీ... సమయానికి ఆక్సిజన్ సిలిండర్ సెట్ చెయ్యకపోతే మాత్రం చనిపోతున్నారు. చాలా మంది ఇళ్లలోనే ట్రీట్‌మెంట్ తీసుకుంటూ... తీరా... ఆయాసం పెరిగిపోయాక... ఆస్పత్రికి వెళ్తూ... మధ్యలోనే చనిపోతున్న ఘటనలు జరుగుతున్నాయి. అందువల్ల కరోనా సోకిన వారు... ఇతరులు ఏమనుకుంటారో అనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి... ఇతరుల్ని కరోనాపై అలర్ట్ చేస్తూ... తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం సరైన విధానం అంటున్నారు డాక్టర్లు.
Published by: Krishna Kumar N
First published: July 5, 2020, 10:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading