NO MORE MASKS IN CARS FOR DELHI GOVT LIFTS COVID CURBS MEANWHILE CENTRE EXTENDS RULES UNTIL MARCH 31 MKS
Covid Curbs: కొవిడ్ ఆంక్షలు ఎత్తేసిన ఢిల్లీ సర్కార్.. మార్చి 31 దాకా పొడిగించిన కేంద్రం!
ప్రతీకాత్మక చిత్రం
ఢిల్లీ ప్రభుత్వం కొవిడ్ నియంత్రణకు సంబందించి అన్ని రకాల నియంత్రణలను ఎత్తేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుంటే జరిమానాలను సైతం తగ్గించింది. అయితే కేంద్రం మాత్రం కొవిడ్ ఆంక్షలను మార్చి 31 వరకు పొడిగించింది.
భారత్ లో కరోనా మహమ్మారి మూడో వేవ్ దాదాపు ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్ నిబంధనలను ఎత్తేస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం తాజాగా కొవిడ్ నియంత్రణకు సంబందించి అన్ని రకాల నియంత్రణలను ఎత్తేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుంటే జరిమానాలను సైతం తగ్గించింది. అయితే రాష్ట్రాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం మాత్రం కొవిడ్ ఆంక్షలను మార్చి 31 వరకు పొడిగించింది. పూర్తి వివరాలివే..
కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న క్రమంలో ఇప్పటిదాకా అమలైన కొవిడ్ ఆంక్షలను ఢిల్లీ ప్రభుత్వం ఎత్తేసింది. ఢిల్లీలో నైట్ కర్ఫ్యూను శుక్రవారం నుంచే పూర్తిగా ఎత్తేసిన ప్రభుత్వం.. వాహనదారులకూ ఊరటకల్పించే నిర్ణయాన్ని ప్రకటించింది. కార్లలో ప్రయాణించేవారు ఇకపై తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ ఉత్తర్వులు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
ఢిల్లీ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కార్లలో ప్రయాణించే వారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పినప్పటికీ, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధారణ నిబంధన ఒక్కటే పొడగించారు. అయితే, జరిమానాలను భారీగా తగ్గించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు లేకుండా తిరిగితే విధించే జరిమానాను రూ.2 వేల నుంచి రూ.500 తగ్గిస్తూ ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే,స
కొవిడ్ ఆంక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం భిన్న ఆదేశాలు జారీ చేసింది. కొత్త కేసులు తగ్గినప్పటికీ రిస్క్ తీసుకోలేమంటూ కొవిడ్ నిబంధనలను మార్చి 31 వరకు పొడిగించింది కేంద్రం. హోం శాఖ కార్యదర్శి అజయ్ బల్లా దీనికి సంబంధించిన అంశాలను శుక్రవారం వెల్లడించారు. ఆరోగ్య శాఖ సూచనల మేరకు రిస్క్ అసెస్మెంట్ ఆధారిత విధానాన్ని అమలు చేయాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు భల్లా లేఖలు రశారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను విశ్లేషించిన తర్వాత సడలింపులను పరిగణిస్తామన్నారు. సడలింపుల విషయంలో రాష్ట్రాలదే అంతిమ నిర్ణయం కాబట్టి కేంద్రం ఉత్తర్వుల పాలన తప్పనిసరి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం నాటి లెక్కల్లో కొత్తగా 11,499 కోవిడ్ కేసులు, 255 మరణాలు నమోదయ్యాయి.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.