news18-telugu
Updated: March 24, 2020, 4:09 PM IST
(ప్రతీకాత్మక చిత్రం)
మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం తలనొప్పిగా మారిందా? మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని టెన్షన్ పడుతున్నారా? మూడు నెలల వరకు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలు లేవు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన వరమిది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. భారతదేశంలోనూ ఇదే పరిస్థితి. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇబ్బందులూ ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా అందరూ కష్టాల్లో ఉన్నారు. వారందరికీ ఊరట కల్పించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనేక కీలక నిర్ణయాలను ప్రకటించారు. అందులో ఒకటి బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలను ఎత్తేయడం. ప్రజలంతా తప్పనిసరైతేనే బ్యాంకులకు వెళ్లాలని, ఆన్లైన్ లావాదేవీలు చేసుకోవాలని సూచించారు నిర్మలా సీతారామన్. ఇక డెబిట్ కార్డ్ హోల్డర్లు ఏ ఏటీఎంలో అయినా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. వీటికి పరిమితి లేదు. ఛార్జీలు కూడా లేవు. మూడు నెలల వరకు ఈ ఊరట లభిస్తుంది.
సాధారణంగా ఆర్థిక సంవత్సరం మార్చి 31న ముగుస్తుంది. అనేక ఆర్థిక వ్యవహారాలకు, లావాదేవీలకు మార్చి 31 చివరి తేదీ. దీంతో అనేక వర్గాల్లో టెన్షన్ నెలకొంది. వీరికి ఊరట కల్పిస్తూ జూన్ 30 వరకు ఆర్థిక సంవత్సరాన్ని పొడిగించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూన్ 30 వరకు అవకాశముంది. ఇక వ్యాపారులు మార్చి, ఏప్రిల్, మే జీఎస్టీ రిటర్న్స్‌ని జూన్ 30 లోగా ఫైల్ చేయొచ్చు. ఆధార్ పాన్ లింక్ చేయడానికి గడువును మార్చి 31 నుంచి జూన్ 30 వరకు పొడిగించారు. మీ పాన్-ఆధార్ లింక్ స్టేటస్‌ని తెలుసుకోవడానికి
ఇక్కడ క్లిక్ చేయండి.ఇవి కూడా చదవండి:
ATM: ఏటీఎంకు వెళ్లలేకపోతున్నారా? ఇంటికే డబ్బులు పంపిస్తున్న బ్యాంకులు
Coronavirus: హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ పాయింట్స్ మర్చిపోవద్దు
Work From Home: మీ వైఫై స్పీడ్‌ని పెంచే 9 టిప్స్ ఇవే
Published by:
Santhosh Kumar S
First published:
March 24, 2020, 4:04 PM IST