హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

No Mask: నిన్నటి వరకు సెకెండ్ వేవ్ టెన్షన్.. జులై 19 తర్వాత అక్కడ మాస్క్‌లు వాడక్కర్లేదు

No Mask: నిన్నటి వరకు సెకెండ్ వేవ్ టెన్షన్.. జులై 19 తర్వాత అక్కడ మాస్క్‌లు వాడక్కర్లేదు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

No Masks: నిన్నటి వరకు అక్కడ కరోనా విలయతాండవం చేసింది. దాదాపు ఏడాదిన్నరగా ప్రజలు కరోనా రక్కిసి కారణంగా ఆంక్షల మధ్యే గడిపారు. ఇప్పుడు వారికి స్వేచ్ఛ నివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే జులై 19 తరువాత మాస్కులు ధరించాలనే నిబంధనను ఎత్తివేసే ఆలోచన చేస్తోంది. ఎక్కడో తెలుసా..?

ఇంకా చదవండి ...

No Mask: క‌రోనా మహమ్మారి నుంచి యావత్ ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కర్ఫ్యూలు, లాక్ డౌన్ ఆంక్షలను మెల్లిమెల్లిగా ఎత్తేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇప్పటి వరకు ఆయా ప్రభుత్వాలు తీసుకున్న నిబంధనలు మంచి ఫలితాలే ఇస్తున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడంతో క‌రోనా ర‌క్కసి ప్రభావం తగ్గుతోంది. అయినా ఇంకా థర్డ్ వేవ్ పొంచే ఉందని వార్తల నేపథ్యంలో అంతా అలర్ట్ అవుతున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే నిన్నమొన్నటి వరకు కరోనాతో అల్లాడిపోయిన బ్రిటన్‌లో మళ్లీ పాత రోజులు రాబోతున్నాయని సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్న కరోనా నిబంధనలను ఎత్తివేయాలని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతుండడంతో ఈ నెల 19 నుంచి నిబంధనలను ఎత్తివేయాలని ప్రధాని సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కేవలం ఆంక్షలు ఎత్తివేయడమే కాదు.. మాస్కులు ధరించడాన్ని కూడా ప్రజల ఇష్టానికే వదిలేయలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. .

బ్రిటన్ గృహనిర్మాణ శాఖ మంత్రి కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. నిబంధనలు ఎత్తివేసేందుకు, తిరిగి సాధారణ జీవనం సాగించేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయని మంత్రి స్పష్టం చేశారు.వైరస్‌తో కలిసి జీవించే ఒక విభిన్న కాలానికి మనమంతా వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. కొవిడ్ ఆంక్షలు లేని కాలానికి మనమంతా వెళ్తున్నామని, అయితే ప్రజలేం చేయాలో ప్రభుత్వం చెప్పదన్నారు. కాగా, ఆంక్షల ఎత్తివేతకు సంబంధించి వచ్చే వారం ప్రధాని బోరిస్ ప్రకటిస్తారని అక్కడి మీడియా పేర్కొంది.

ఇదీ చదవండి: బై బై జెఫ్‌ బెజోస్.. ఫ్యూచర్ ప్లాన్ ఇదే.. ఆస్థి విలువ ఎంతో తెలుసా..? అమేజాన్‌ ప్రస్థానం ఎలా మొదలైంది?

మహమ్మారి ధాటికి విలవిలలాడి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బ్రిటన్‌లో జులై 19 తరువాత ఆంక్షలు ఎత్తివేయాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాస్క్ వాడకం, భౌతిక దూరం పాటించడంతో పాటుగా పలు రకాల నిబంధనలు ఎత్తివేసే యోచనలో బ్రిటన్ ప్రధాని ఉన్నట్లుగా అంతర్జాతీయ ప్రతికలు చెబుతున్నాయి. అలాగే జిమ్‌, రెస్టారెంట్స్‌, మ్యూజియం తదితర వాటిల్లో స్కానింగ్ నిబంధ‌న‌ల‌ను పక్కన పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వేగంగా అమలు చేస్తున్న వ్యాక్సిన్ విధానం స‌త్ఫలితాలు ఇస్తుండటంతో, మాస్క్ వాడాలా, వద్దా అనేది ప్రజల ఇష్టానికి వదిలేయాలని అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఏడాదిన్నర కాలంగా ఆంక్షలతో మ‌గ్గిపోయిన ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారని, వారి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని బ్రిటన్ గృహనిర్మాణ శాఖ మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: లైవ్ లోనే ప్రియుడి చెంప చెల్లుమనిపించిన ప్రేయసి.. కారణం తెలిస్తే షాక్..

First published:

Tags: Britain, Corona mask, Corona second wave, Face mask, International news, London

ఉత్తమ కథలు