Home /News /coronavirus-latest-news /

NO HOLI AGAIN GUJARAT GOVERNMENT RESTRICTS HOLI CELEBRATIONS AMID COVID19 CASES RISE SK

No Holi: ఈసారి కూడా హోలీ లేదు.. కరోనా విజృంభణతో అక్కడ కఠిన ఆంక్షలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా విజృంభణ నేపథ్యంలో.. గుజరాత్‌లోని అహ్మదాబాద్, రాజ్‌కోట్, సూరత్, వడోదరాలో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు ఎవరూ బయటకు రాకూడదు.

    ఏడాది గడిచింది. ఇప్పటికీ కరోనా పీడ విరగడ కాలేదు. కొత్త కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కరోనా దెబ్బకు గత ఏడాది ఇదే సమయంలో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. హోలీ, ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ సహా ఏ పండగలూ జరుపుకోలేదు. ఐతే ఈసారి కూడా అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా కరోన మళ్లీ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. హోలీ వేడుకలపై ఆంక్షలు విధించింది. హోలి సంబరాలకు అనుమతులు ఇవ్వలేదని.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ భాయ్ పటేల్ స్పష్టం చేశారు.

    ''హోలీ వేడుకలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. హోలీ సందర్భంగా ప్రజలెవరూ గుంపులు గుంపులుగా ఉండకూడదు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోకూడదు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గుజరాత్ ప్రజలు హోలీ ఆడకుండా, కోవిడ్ నిబంధనలను పాటిస్తారని నమ్ముతున్నా. కేవలం హోలికా దహనానికి మాత్రమే ఉంటుంది. దానికి కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఉంటుంది.'' అని నితిన్ భాయ్ పటేల్ పేర్కొన్నారు

    కాగా, హోలి పండుగ మార్చి 29న వస్తోంది. దానికి ఒక్క రోజు ముందు హోలికా దహనం కార్యక్రమం నిర్వహిస్తారు. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా మంటలు వేస్తారు. చాలా మంది గుమిగూడి ఆడిపాడతారు. కానీ కరోనా కారణంగా ఎక్కువ మంది గుంపులు గుంపులుగా ఉండకూడదని గుజరాత్ ప్రభుత్వ ఆదేశించింది.

    గుజరాత్‌లో గడిచిన 24 గంటల్లో 1565 కరోనా కేసులు వచ్చాయి. నాలుగు నెలల్లో ఇంత ఎక్కువ కేసులు రావడం ఇదే తొలిసారి. తాజా లెక్కలతో గుజరాత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,85,429కి చేరింది. కరోనా విజృంభణ నేపథ్యంలో.. గుజరాత్‌లోని అహ్మదాబాద్, రాజ్‌కోట్, సూరత్, వడోదరాలో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు ఎవరూ బయటకు రాకూడదు. అహ్మదాబాద్‌లో శని, ఆదివారంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. వారాంతాల్లో పార్క్‌లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మూసివేస్తున్నారు. చాలా రాష్ట్రాలు ఇలాంటి నిబంధనలనే అమలు చేస్తున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Coronavirus, Covid-19, Gujarat, Holi 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు