Telangana Lockdown: కరీంనగర్‌లోని ఆ ప్రాంతాల్లోకి నో ఎంట్రీ…

కరీంనగర్‌లోని పలు ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించిన అధికారులు... అక్కడ నో ఎంట్రీ అని తేల్చేశారు.

news18-telugu
Updated: March 26, 2020, 2:23 PM IST
Telangana Lockdown: కరీంనగర్‌లోని ఆ ప్రాంతాల్లోకి నో ఎంట్రీ…
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరీంనగర్‌లో పర్యటించిన పలువురు ఇండోనేషియన్లకు కరోనా పాజిటివ్ అని తేలడంతో హై అలర్ట్ ప్రకటించారు. పలు ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతాలకు మూడుకిలోమీటర్ల వరకూ ఎవరినీ అనుమతించడం లేదు. కేసు నమోదైన ఇంటికి సమీపంలోనే.. 80 మంది కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్సఅందిస్తున్నారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని.. ఏమైనా కావాలంటే టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి,, చెబితే తామే స్వయంగా తీసుకొస్తామని పోలీసులు చెబుతున్నారు. కాదని బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ముఖరాంపురా, భగత్ నగర్, కశ్మీర్ గడ్డ..ప్రాంతాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైఅలర్ట్ ప్రకటించారు.

ఇక ఆశావర్కర్లు, అంగన్వాడీ, ఏఎన్ఎంలు నగరంలోకి ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. కొందరిని ఆస్పత్రుల్లో అడ్మిట్ చేయగా.. మరికొందరు స్వీయనిర్భందంలో ఉన్నారు. బయటకు వస్తే, ప్రాణాలకే ముప్పని అధికారులు హెచ్చరిస్తున్నారు. 21 రోజుల పాటు జరిగే లాక్ డౌన్‌కు జిల్లా ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నారు. మార్చి 1 తర్వాత విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వారిని గుర్తించి స్టాంపింగ్‌ చేశారు. వివిధ దేశాల నుంచి రాజీవ్‌గాంధీ విమానాశ్రయం నుంచి జిల్లాకు 371 మంది విదేశీ ప్రయాణికులు వచ్చారు. వీరిలో గంగాధర మండలంలో 58 మంది, రామడుగులో 48 మంది, చొప్పదండిలో 39 మంది ఉన్నారు. ఇప్పటికే వీరిలో పలువురికి ఎడమ చేతి మణికట్టుపైన ఇండిబుల్‌ ఇంక్‌తో స్టాంపులు వేశారు.






First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు