ఆరోగ్య సేతు యాప్ పూర్తిగా సురక్షితం..కేంద్రం క్లారిటీ..

ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం... కరోనా నివారణలో భాగంగా... ప్రతి స్మార్ట్ మొబైల్‌లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలని చెబుతూ వచ్చింది. కానీ ఇప్పుడీ రూల్ పక్కన పెట్టింది. ప్రయాణాల్లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. విమానాలు, రైళ్లలో ఈ యాప్ కంపల్సరీ కాదనీ, ప్రయాణికులు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి... యాప్ లేకుండానే ప్రయాణించవచ్చని కేంద్రం తాజాగా కర్నాటక హైకోర్టుకు తెలిపింది. ఇలా కేంద్రం తన రూల్ మార్చుకోవడానికి బలమైన కారణం ఉంది. బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అరవింద్... ఆరోగ్య సేతు యాప్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. దానికి సరైన సెక్యూరిటీ లేదనీ... ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కేంద్రం తీసుకుంటోందనీ... ప్రజల ప్రైవసీకి భంగం కలిగిస్తోందనీ... ఇలా చాలా అభ్యంతరాలు తెలిపారు. (credit - google play store)

కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ ను పూర్తి స్థాయిలో టెస్ట్ చేసి వివరణ ఇచ్చింది. ఆరోగ్యసేతు యాప్ ఏ ఒక్క యూజర్ కు సంబంధించిన సమాచారం కూడా హ్యాకింగ్ కు గురికాలేదని కాలేదని ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చింది.

  • Share this:
    ఆరోగ్య సేతు యాప్ పూర్తిగా సురక్షితమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ యాప్ ద్వారా పౌరుల డేటా సెక్యూరిటీ ఎలాంటి సమస్య కూడా లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింంది. యాప్ ద్వారా ఇప్పటివరకు ఎటువంటి భద్రతా ఉల్లంఘన జరగలేదని పేర్కొంది. ఇదిలా ఉంటే ఆరోగ్య సేతు యాప్ నుంచి వ్యక్తిగత వివరాలు హ్యాకింగ్ చేసే చాన్స్ ఉంది అంటూ ఓ ఫ్రెంచ్ ఎథికల్ హ్యాకర్ చేసిన ట్వీట్ కలకలం రేపింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ ను పూర్తి స్థాయిలో టెస్ట్ చేసి వివరణ ఇచ్చింది. ఆరోగ్యసేతు యాప్ ఏ ఒక్క యూజర్ కు సంబంధించిన సమాచారం కూడా హ్యాకింగ్ కు గురికాలేదని కాలేదని ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చింది. ప్రజల డేటా భద్రతకు సంబంధించిన అంశంలో రాజీ పడే ప్రసక్తే లేదని, దేశంలో ఎవరైనా ఆరోగ్య సేతు యాప్ లో సమస్యలు గుర్తిస్తే తమ దృష్టికి తేవాలని సూచించింది.
    Published by:Krishna Adithya
    First published: