
మే 24వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని రైల్వే శాఖ ప్రకటించింది.
కేంద్ర హోం శాఖ అనుమతులు తీసుకున్న వలస కార్మికులకు స్వరాష్ట్రానికి పంపించే వెసులుబాటును రైల్వే శాఖ కల్పించింది.
వలస కార్మికులను స్వస్థలాకు తరలించేందుకు రైల్వేశాఖ శ్రామిక్ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. ఐతే కొన్ని రాష్ట్రాలు వీటిపై అభ్యంతరం చెబుతున్నాయి. తమ రాష్ట్రాల మీదుగా రైళ్లను నడపవద్దని, తమ రాష్ట్రంలోని ఆపవద్దని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రామిక్ రైళ్లను నడిపేందుకు ఆయా రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఇరు రాష్ట్రాల అంగీకారంతోనే వలస కూలీలను రైళ్లలో తరలిస్తున్నారు. ఐతే పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి కొన్ని రాష్ట్రాలు వలస కార్మికులతో వెళుతున్న శ్రామిక్ రైళ్లను వారి రాష్ట్రాల్లోకి అనుమతించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం శాఖ అనుమతులు తీసుకున్న వలస కార్మికులకు స్వరాష్ట్రానికి పంపించే వెసులుబాటును రైల్వే శాఖ కల్పించింది.
Published by:Shiva Kumar Addula
First published:May 19, 2020, 20:28 IST