Zehra Mirza: కరోనా బాధితులకు నిజామ్ వారసురాలి సాయం.. తెలిస్తే సలామ్​ చేస్తారు

జెహ్రా మీర్జా

నిజామ్ రాజు మీర్​ ఉస్మాన్ అలీ ఖాన్​ ముని మనవరాలు జెహ్రా మీర్జా.. తన మంచి మనసు చాటుకుంటున్నారు. హైదరాబాద్​ను చివరగా పాలించిన ఉస్మాన్ అలీ రెండో కుమారుడు మొయాజామ్ జాకు మునిమనవడైన హిమాయత్ అలీ మీర్జా కూతురే జెహ్రా.

  • Share this:
నిజామ్ రాజు మీర్​ ఉస్మాన్ అలీ ఖాన్​ ముని మనవరాలు జెహ్రా మీర్జా.. తన మంచి మనసు చాటుకుంటున్నారు. తన ఆర్ట్​ కలెక్షన్​ను అమ్ముతూ కరోనా రోగులు, పేద ప్రజలకు సాయం చేస్తున్నారు. హైదరాబాద్​ను చివరగా పాలించిన ఉస్మాన్ అలీ రెండో కుమారుడు మొయాజామ్ జాకు మునిమనవడైన హిమాయత్ అలీ మీర్జా కూతురే జెహ్రా. జెహ్రా మీర్జా స్వతహాగా మంచి ఆర్టిస్ట్​. చాలా కాలంగా ఎన్నో పెయింటింగ్స్ వేశారు. ఇప్పుడు తన పెయింటింగ్స్​ను వేలం వేసి.. అవి అమ్మగా వచ్చిన డబ్బును ఆమె వివిధ ఆసుపత్రులకు, చారిటబుల్ ట్రస్ట్​లకు అందిస్తున్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో వైరస్ బాధితులతో పాటు పేదలకు చేయూతనందిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.4లక్షలను ఆమె విరాళంగా ఇచ్చారు. లాక్​డౌన్ సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారి ఆకలి తీరుస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల సాయంతోనూ ఆమె అవసరార్థులకు సాయం అందిస్తున్నారు.

“ఓ ఆర్టిస్ట్​గా జీవితంలోని అందాలను నిత్యం వీక్షించగలను. నాకు సేవ చేయడం అంటే ఎంతో ఇష్టం. అయితే ఇతరులకు సాయం అందించడం చాలా ముఖ్యమని మునుపెన్నడూలేని విధంగా ప్రస్తుత పరిస్థితి అందరికీ తెలియజేస్తోంది. కరోనా వైరస్​తో బాధపడుతున్న వారికి, పేదలకు కనీస అవసరాలు కూడా తీరడం లేదు. నాకు సాధ్యమైనంత సాయం చేయడం నా విధి. ప్రస్తుతం డబ్బు విరాళంగా ఇవ్వడంతో పాటు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాం” జెహ్రా మీర్జా చెప్పారు.

ఒకప్పటి మహారాణి నీలోఫర్ మునిమనువరాలు జెహ్రా మీర్జా. తెలంగాణలోనే అతిపెద్దదైన చిన్నపిల్లలు, గర్భిణుల ఆస్పత్రి నిలోఫర్ ఆమె పేరిటే ఉన్న సంగతి తెలిసిందే. జెహ్రా మీర్జా ఫ్యాషన్ డిజైనర్​గానూ పని చేస్తున్నారు. అలాగే క్యాన్సర్ రోగుల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం లాక్​డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేస్తున్నారు. అందుకోసం కొత్తగా చారిటబుల్ ట్రస్ట్​ను కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు జెహ్రా.

జెహ్రా మీర్జా తన పేరిటే హైజరాబాద్​లో ఓ ఆర్ట్ గ్యాలరీని స్థాపించారు. అక్కడే ఆమె గీసిన చిత్రాలను అమ్ముతారు. అలా వచ్చిన డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అమెరికాలోని లియోనైస్​​ యూనివర్సిటీ నుంచి ఆమె గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్​లో డిప్లొమా చేశారు. రియల్ ఎస్టేట్ కెరీర్​తో పాటు ఆర్ట్​లోనూ ప్రావీణ్యం సాధించడానికి జెహ్రా కొంతకాలం రష్యాలో ఉన్నారు. అక్కడ బిజినెస్​లోనూ డిప్లొమా పూర్తి చేశారు. లా కూడా చేయాలని ఆమె అనుకుంటున్నారు. అలాగే భవిష్యత్తులో తన సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని అనుకుంటున్నట్టు జెహ్రా చెప్పారు.
Published by:Sumanth Kanukula
First published: