1500 మంది కార్మికులకు భోజనం అందచేసిన ..ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా

1500 మంది కార్మికులకు భోజనం అందచేసిన ..ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా

లాక్ డౌన్ ఎత్తి వేసేవరకు ఈ యొక్క భోజన వితరణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు గణేష్ గుప్తా..

 • Share this:
  నిజామాబాద్ నగరంలో ఎమ్మెల్యే బిగాల పర్యటించారు.. నిజామాబాద్ నగరంలోని సానిటేషన్ 4వ జోన్ లోని కార్యాలయంలో కార్మికులకు మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్బంగా ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా శుభాకాంక్షలు తెలియ చేశారు. కార్మికులతో నేరుగా ముచ్చటించారు. అనంతరం కార్మికులకు స్వయంగా స్వీట్ ప్యాకెట్లతో కూడిన భోజనం అందచేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోన వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ప్రజల ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు...
  నగర ప్రజలు క్షేమంగా ఉండాలంటే అత్యవసర సేవలు నిరంతరం కొనసాగలి... దేశం, రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసర సేవల సిబ్బందికి కనీసం మంచి నీరు కూడా ఇవ్వడానికి భయపడుతున్నారు. ఈ పరిస్థితిని నేరుగా గమనించిన నేను ఈ విపత్కర కాలంలో నగర పాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం సిబ్బంది,మంచి నీటి సరఫరా సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, వారి ప్రాణాలని లెక్క చేయకుండా మన ప్రాణాల కోసం పనిచేస్తున్నారు. వీరికి నేను నా శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను అన్నారు..
  ఈ అత్యవసర సిబ్బంది కోసం నా వంతు బాధ్యత గా గత నెల రోజుల నుండి సుమారు 1500 మందికి ప్రభుత్వ జిల్లా అధికారుల సమక్షంలో నాణ్యమైన భోజనం తయారు చేసి ప్రత్యేక బృందాల ద్వారా వారు పనిచేస్తున్న చోటునే భోజనం అందచేస్తున్నారు.. లాక్ డౌన్ ఎత్తి వేసేవరకు ఈ యొక్క భోజన వితరణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు గణేష్ గుప్తా..
  Published by:Venu Gopal
  First published: