news18-telugu
Updated: May 13, 2020, 11:05 PM IST
నితిన్ గడ్కరీ (File)
కరోనా వైరస్ ల్యాబ్ నుంచే పుట్టిందని, సహజంగా పుట్టింది కాదని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ మీద నితిన్ గడ్కరీ స్పందించారు. ‘కరోనా వైరస్ సమయంలో ఎలా జీవించాలో నేర్చుకోవాలి. ఇది సహజంగా వచ్చిన వైరస్ కాదు. ఇది కృత్రిమంగా తయారైన వైరస్. ప్రపంచంలో దీనికి వ్యాక్సిన్ కోసం చాలా దేశాలు శ్రమిస్తున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులో లేదు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు.’ అని నితిన్ గడ్కరీ చెప్పినట్టు ఎన్డీటీవీ కథనంలో పేర్కొంది. అలాగే కరోనా వైరస్ను గుర్తించే మెథడాలజీ కావాలని నితిన్ గడ్కరీ అన్నారు. ‘ఒక మంచి మెథడాలజీని గుర్తిస్తే అప్పుడు కరోనా వైరస్ను వేగంగా పసిగట్టవచ్చు. ఇది ఊహించలేనిది ఎందుకంటే, వైరస్ అనేది ల్యాబ్ నుంచి సృష్టించారు. ఈ వైరస్ సహజంగా పుట్టింది కాదు. దానికి ఓ పరిస్కారం కనిపెట్టిన తర్వాత భరోసా నింపవచ్చు. ఒకసారి వ్యాక్సిన్ తీసుకుంటే, ఆ తర్వాత సమస్య ఉండదు.’ అని గడ్కరీ అన్నారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
May 13, 2020, 11:05 PM IST