Vaccine For Pregnant: ఇక వాళ్లు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ప్రతీకాత్మక చిత్రం

Vaccine For Pregnant: పాలిచ్చే తల్లులు, గర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల హై రిస్క్ నుంచి రక్షణ దొరుకుతుందని కేంద్రం వెల్లడించింది.

  • Share this:
    అర్హులైన వారందరికీ కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న కేంద్రం.. గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు టీకా ఇచ్చే అంశంపై కూడా క్లారిటీ ఇచ్చింది. వీరి కూడా వ్యాక్సిన్లు తీసుకోవచ్చని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. వ్యాక్సిన్ వారికి కూడా సురక్షితమే అని తెలిపారు. కొవీషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్, మోడర్నా వ్యాక్సిన్లు తీసుకోవచ్చని గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది. వీటిని తీసుకోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదని స్పష్టం చేశారు.కొవాగ్జిన్, కొవీషీల్డ్, స్పుత్నిక్ వీ, మోడర్నా నాలుగు వ్యాక్సిన్లు పాలిచ్చే తల్లులకు, గర్భిణీలకు సేఫ్ అని తెలిసిందని వీకే పాల్ స్పష్టం చేశారు.

    ఇందుకు సంబంధించి ఫ్రంట్ లైన్ వర్కర్లకు, వ్యాక్సినేటర్లకు ఆరోగ్యశాఖ కౌన్సిలింగ్ ఇవ్వనుంది. దాంతో పాటు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల గర్భిణీలు హాస్పిటలైజేషన్ అవ్వకుండానే 90శాతం మంది మహిళలు కోలుకున్నారని ప్రభుత్వం తెలిపింది. అందుకే గర్భిణీలు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవడమే మంచిదని సూచించింది. పాలిచ్చే తల్లులు, గర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల హై రిస్క్ నుంచి రక్షణ దొరుకుతుందని వెల్లడించింది. టీకా వేయించుకోకపోవడం వల్ల హై రిస్క్ లేదా ప్రాణాంతకమైన సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుందని.. హాస్పిటల్‌కు తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపింది.
    Published by:Kishore Akkaladevi
    First published: