Home /News /coronavirus-latest-news /

NIRMALA SITHARAMAN DECISION TO INCREASE STATES BORROWING CAPACITY FROM 3 PERCENT TO 5 PERCENT WILL HELP KCR AND YS JAGAN BA

నిర్మలా సీతారామన్ ప్రకటనతో కేసీఆర్, జగన్‌కు భారీ ఊరట...

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం జగన్

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం జగన్

రాష్ట్రాలు మరిన్ని రుణాలు తీసుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు భారీ ఊరట కలగనుంది.

    ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీలో ఐదో అంకాన్ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి చేశారు. ఐదో రోజు నిర్మలా సీతారామన్ ప్రకటించిన నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలకు భారీ ఊరట కలగనుంది. భారీ ఎత్తు సంక్షేమ పథకాలు, ఆర్థిక సమస్యలతో ఉన్న రాష్ట్రాలకు కేంద్రం నిర్ణయం భారీగా ఉపశమనం కలిగించేదే. రాష్ట్రాలకు రుణ పరిమితి 3 నుంచి 5 శాతానికి పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థికి మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. రుణ పరిమితిని 3 నుంచి 3.5 శాతం పెంచుకునేందుకు ఎలాంటి షరతులు వర్తించబోవని స్పష్టం చేశారు. అయితే కొన్ని షరతులతో 3.5 నుంచి 5 శాతం వరకు రుణ పరిమితిని పెంచుకునే అవకాశం కల్పించారు. రుణ పరిమితి పెంపు వల్ల రాష్ట్రాలకు రూ. 4.28 లక్షల కోట్లు అదనంగా అప్పులు తెచ్చుకునే అవకాశం లభిస్తుందన్నారు.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలకు, అభివృద్ధి పథకాలకు పెద్ద ఎత్తున నిధులు కావాలి. ఇప్పుడు కేంద్రం రుణపరిమితిని పెంచడంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కొంచెం వెసులుబాటు కలుగుతోంది. రాష్ట్రాల ఎఫ్ఆర్బీఎం పరిధిని పెంచాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సుమారు 40 రోజుల పాటు ఆదాయాన్ని కోల్పోయాయి. ఇప్పటికే ఏపీలో సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వ భూములను విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, CM KCR, Nirmala sitharaman, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు